భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామిడి సంజీవరెడ్డి, సిద్ధిపేట (తెలంగాణ)
ప్రశ్న: నేను ఆర్.టి. సిలో డ్రైవర్‌గా పనిచేసాను. వెన్నుపూస డిస్క్ సమస్య కారణంగా డ్రైవర్ నుండి కండక్టర్‌గా మార్చినారు. ఆఫీస్‌లో పనికోసం ఇమ్మని కోర్టులో వేశాను. భవిష్యత్తు ఏవౌతుంది చెప్పండి?
సమాధానం:మీరు కోర్టుకు పోవలసినది కాదు- మన మాన్య ముఖ్యమంత్రిగారికి విజ్ఞాపన పంపించవలసింది- మన ముఖ్యమంత్రి గౌ చంద్రశేఖరరాగారు మానవతా విలువలు గుర్తించే సహృదయులు. మీకు తప్పక న్యాయం జరిగేది. సానుభూతికి సంబంధించిన విషయాలను కోర్టు ద్వారా ప్రయత్నించవలసింది కాదు. (సిద్ధిపేట కనుక) కనీసం గౌ మంత్రివర్యులు హరీశ్‌రావుగారినైనా కోరవలసింది. ప్రస్తుత పరిస్థితిలో మీ సమస్య పరిష్కారం కోర్టు ద్వారా చాలా ఆలస్యం.
వెంగళసామీ కిరణ్, జాలపల్లి, తెలంగాణ
ప్ర:శారీరకంగా అంగవైకల్యం- పేదరికం- నాకు ప్రభుత్వోద్యోగం లభించగలదా?
సమా:దైవసేవగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆరు అరటి పండ్లు ఆంజనేయస్వామికి నివేదన చేయండి. తప్పక శుభం జరుగుతుంది.
బి.ప్రవీణ్‌కుమార్, బరంపురం (ఒడిసా)
ప్ర:నాకు వ్యవసాయం లాభిస్తుందా- ఆర్థికంగా బాగుంటుందా?
సమా:‘కృషితో నాస్తి దుర్భిక్షం’ వ్యవసాయమే చేయండి. ‘అన్నం బహుకుర్వీత్’ అంటుంది వేదం. వ్యవసాయం సమాజానికి అన్నం వడ్డించే పవిత్ర వృత్తి. ధనం- ధాన్యం వెంటే వస్తుంది. వ్యవసాయమే చేయండి.
జి.జె. (పూర్తిపేరు లేదు), ఊరి పేరు లేదు (ప.గో.)
ప్ర:సాముద్రిక శాస్త్ర విషయం- ఎడమ చూపుడువేలు నుండి మధ్యవేలు వరకు అధోముఖంగా వలయం. ఫలితం ఏమిటి?
సమా:మీరు వివరించిన దాని ప్రకారం అది గురువలయం. ఇంగ్లీషులో ‘రింగ్ ఆఫ్ సాలమన్’ అంటారు. అది శుభ చిహ్నమే కానీ మీకు ఎడమ చేతిలో అధోముఖంగా ఉండటంవలన అది యోగభంగాన్ని కలిగిస్తుంది.

కాటమనేని దిగ్విజయ్ చౌదరి, నెల్లూరు, ఆంధ్ర
ప్ర:మేము ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాని ప్రొడక్షన్ కంపెనీ కాని పెట్టాలనుకుంటున్నాము. పేరు సూచించగలరా?
సమా:పత్రికా ముఖంగా సాధ్యం కాదు. భాగస్వాములతో కలిసి రండి.
ఆర్.విజయకిశోర్, చిలకలూరిపేట, ఆంధ్ర
ప్ర:ఇంటి సంప్రదాయం- వీరుల పెట్టె- పాటించకుండా వివాహం చేసుకోవచ్చా?
సమా:మీరు చెప్పిన సంప్రదాయం పట్ల నాకు ఎక్కువగా ఏమీ తెలియదు. అయితే ఇంట్లో ఆనువంశికంగా వస్తూ ఉన్న సంప్రదాయాన్ని తప్పక పాటించాలి.
కె.రమాదేవి, తాడిపత్రి, అనంతపురం
ప్ర:లోగడ నేను షిరిడీ సాయిబాబాను- తులసి చెట్టును పూజించేదాన్ని. ఒక సంవత్సరం నుండి మానుకున్నాను. మళ్లీ పూజించమంటారా?
సమా:దేవతా సేవ ఏ రూపంలోనైనా మంచిదే. శ్రద్ధగా చేయగలిగితే కొనసాగించండి.
ఎస్.లక్ష్మీదేవి, తాడిపత్రి, అనంతపురం
ప్ర:ఇల్లు వదలిపోయిన కుమారుడు- రాగలడా? ఎప్పుడు?
సమా:త్వరలోనే వార్త రాగలదు.
శే్వత, మహబూబ్‌నగర్ (తెలంగాణ)
ప్ర:ఉద్యోగ యోగం?
సమా:మీకు ఒక మంచి గృహిణిగా ఉండే యోగమే ఉంది. ప్రభుత్వోద్యోగ యోగం లేదు.
తొండపి సూర్యనారాయణ, నెల్లూరు, ఆంధ్ర
ప్ర:జాతక చక్ర పరిశీలన- చరమ దశ సూచన-
సమా:మిథున లగ్నానికి పూర్ణ శుభులు లేరు. అష్టమంలో శని- ద్వాదశంలో కుజుడు- నవాంశంలో ద్వాదశ నీచ శని- కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి. అయితే రాశిలో కర్కాటక గురువు- మీనంలో స్వస్థానం (అంశలో) శుభ ఫలితాలనీయగలడు. భాగవత పారాయణం చేస్తూ ఉండండి!
పి.వి.ఎన్.కుమార్, శాంతినగర్, హైదరాబాద్
ప్ర:సంతాన విషయం
సమా:ఈ సంవత్సరం చివరలో శుభసూచనలున్నవి.
శోద్రాల సురేశ్‌కుమార్, విజయవాడ - ఆంధ్ర
ప్ర:ఉద్యోగం- వ్యాపారం
సమా:మీకు ఉద్యోగం యోగం లేదు. స్వతహాగా స్వతంత్ర ప్రవృత్తి- ఆత్మాభిమానం- పట్టుదల ఎక్కువ- వ్యాపారమే మీకు లాభిస్తుంది. స్టీలు- సిమెంట్- ఫర్నీచర్- మందులు.
మాతం నారాయణస్వామి, కొత్తపాలెం (ప.గో.)
ప్ర:కూతురు వివాహం- వ్యక్తిగత జీవిత సమస్యలు-
సమా:కూతురు వివాహ ప్రశ్న సంఖ్య ఆమెదై ఉండాలి. మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీలో ఏదో భావ సంఘర్షణలో - బాహ్య సంఘర్షణలో బాధిస్తున్నట్టున్నాయి. సహజంగా మీది రాజీపడు స్వభావం కాదు. కాని కొన్ని సందర్భాలలో రాజీ పడాలి. పట్టుదలలకు పోకండి. మనశ్శాంతి ముఖ్యం.
జి.అరుణాదేవి, భద్రాచలం (తెలంగాణ)
ప్ర:ఒకరికిచ్చిన డబ్బులు- ఇవ్వటంలేదు-
సమా:చాలా కష్టంగా- ఆలస్యంగా- కొంత రాగలదు.
బి.కాంచన, బరంపురం (ఒడిసా)
ప్ర:ప్రభుత్వోద్యోగం-
సమా:అత్యంత దూర ప్రదేశంలో ఆలస్యంగా దొరికే అవకాశం ఉంది.
బారాటం ప్రశాంతి, విజయవాడ (కృష్ణా)
ప్ర:ఋణబాధ- ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తలమైన మాకు మనస్పర్థలు.
సమా:కష్ట సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు బయటివారు కూడా సహకరిస్తారు. సహనంతో శాంతంగా ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి.
వి.పాండురంగారావు, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:దాంపత్య సమస్యలు
సమా:ప్రతి సోమ- మంగళవారాలు- ఈశ్వరాభిషేకం- కుంకుమ పూజ చేయించండి.
చాట్ల వెంకట రమేశ్‌బాబు, చీమకుర్తి (ప్రకాశం)
ప్ర:వివాహం
సమా:ఒక ఆదివారం నవగ్రహ పాశుపంతం- నాలుగు శుక్రవారాలు కన్యా పాశుపత రుద్రాభిషేకాలు స్థానిక పురోహితుల ద్వారా జరిపించండి.

- ఉమాపతి బి.శర్మ సెల్: 9246171342