గౌతమీపుత్ర శాతకర్ణిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. ఫైనల్‌గా ఈ సినిమా ఓకె అయినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు క్రిష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట బాలకృష్ణ. అమరావతి బ్యాక్‌డ్రాప్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. బాలకృష్ణ వందో చిత్రం కోసం పలువురు దర్శకులు పోటీపడ్డారు. సీనియర్ దర్శకులు సింగితం శ్రీనివాసరావు, కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరగా ఈ అవకాశం క్రిష్‌కు దక్కింది. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని, వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా టైటిల్ అందరినీ ఆకట్టుకునేలా వుండేందుకు యోధుడు అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో వున్నారట యూనిట్ సభ్యులు. మొత్తానికి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే బాలకృష్ణ వందో సినిమాపై త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.