తెలంగాణ

రాత్రి 11 గం. వరకు ఆడుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేడియంలు అందుబాటులో ఉంచండి
అధికారులకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 10: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తీరిక లేక యాంత్రిక జీవనాన్ని గడుపుతున్న నగరవాసులకు తీపికబురు. ఆటలకు దూరమైన వారికి చల్లని వార్త. తమకు నచ్చిన క్రీడను ఆడుకునేందుకు వీలుగా రాత్రి పదకొండు గంటల వరకు జిహెచ్‌ఎంసికి చెందిన స్టేడియంలు, క్రీడామైదానాలు ఇకనుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయ. ఈ మేరకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం రాత్రి ఎనిమిది గంటల వరకే స్టేడియంలు, క్రీడామైదానాలు, ఇండోర్ స్టేడియం వంటివి అందుబాటులో ఉన్నందున నగరవాసులకు అందుబాటులో లేకుండాపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి వీటిని నిర్వహిస్తున్నా, ఆశించిన ఫలితం దక్కటం లేదు. అన్ని వర్గాల వారికి వెసులుబాటుగా ఉండేందుకు వీటి సమయాన్ని రాత్రి పదకొండు గంటల వరకు పొడిగించినట్లు కమిషనర్ తెలిపారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నగరంలో రాత్రిపూట క్రీడలు ఆడుకునే అవకాశం లేకపోవడంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనికి తోడు నగరంలో మున్ముందు క్రీడా కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నట్లు వివరించారు. ఇందుకు గాను నగరంలోని ఔత్సాహిక క్రీడాకారులు, ఆసక్తి కల్గిన ఉద్యోగులు, కాలనీ సంక్షేమ సంఘాల వారికి టోర్నమెంట్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందుకు గాను బ్యాడ్మింటన్ క్రీడాకారులు పల్లెల గోపిచంద్, షెటిల్ బ్యాడ్మింటన్ సింధూ సహాకారం కోరనున్నట్లు కమిషనర్ తెలిపారు. వారితో జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే వివిధ క్రీడాంశాల్లో నిర్వహించనున్న టోర్నమెంట్‌లు, పోటీలకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.