రాష్ట్రీయం

15 శాతం వృద్ధి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో పాలనా సంస్కరణలు
వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం
మలేషియా తరహా ల్యాబ్‌ల ఏర్పాటు
జలాల నిర్వహణకు ‘పంట సంజీవని’
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి
ప్రతి పల్లెలో మొక్కల పెంపకం
మేధోమథనంలో బాబు మార్గనిర్దేశం
హైదారాబాద్‌లో అధికారులతో భేటీ

హైదరాబాద్, నవంబర్ 28: వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. శనివారం హైదరాబాద్ సచివాలయం ఎల్ బ్లాక్ సమావేశ మందిరంలో ప్రభుత్వ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, మంత్రివర్గ సహచరులతో ప్రత్యేకంగా నిర్వహించిన మేథోమథనంలో సిఎం రానున్న కాలానికి అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశనం చేశారు. వృద్ధి రేటు లక్ష్య సాధనకు తగిన కార్యాచరణ ఇప్పటి నుంచే జరగాలని ఆకాంక్షించారు. అన్ని వనరులు పుష్కలంగావున్న రాష్ట్రంలో నిర్దేశిత అభివృద్ధి, వృద్ధిలక్ష్యం సాధ్యంకానపుడు దేశంలో మరెక్కడా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం మనకు లభించిన అరుదైన అవకాశం. అంతేకాదు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పెద్దఎత్తున రహదారులు, ఇతర వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. నిరంతరం విద్యుత్‌తో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని, పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్నామన్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగనంత ఆర్థిక వ్యవహారాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఇటువంటి నేపథ్యంలో ఆశించిన వృద్ధిరేటు సాధన కష్టమేమీ కాదన్నారు.
వృద్ధిరేటు సాధిస్తూనే పాలనా వ్యవస్థలో మార్పులు కూడా తీసుకురావడం తప్పనిసరి అన్నారు. ‘మనకు విజన్ డాక్యుమెంట్ ఉంది. గతంలో అభివృద్ధి అనేది ప్రణాళికాబద్ధంగా జరగలేదు. కానీ దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకోమారు అభివృద్ధిని మదింపు చేస్తున్నాం. సంక్షేమానికి పెద్దఎత్తున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే, సరైన మెకానిజం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చి, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధించాలని నిర్ణయించామన్నారు. అందుకు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని చెప్పారు. ఈ విషయంలో మలేషియా ల్యాబ్ ఎక్సర్‌సైజ్ అనుసరణీయమని పేర్కొన్నారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్స్ పెట్టుకుని ప్రతి త్రైమాసికానికి ప్రగతి సమీక్ష చేసే విధానం మలేషియాలో మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.
దేశంలోనే మొదటిసారి ఫోకస్ అప్రోచ్ తీసుకున్నామని, పనితీరు సూచికలు పెట్టుకున్నామని సిఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 2014-15లో ఆర్ధిక వృద్ధిరేటు 7.48గా నమోదైందని, 2015-16లో ప్రభుత్వ లక్ష్యం 10.83 శాతంగా నిర్దేశించుకున్నామని వివరించారు. మొదటి రెండు త్రైమాసికాల్లో వృద్ధి ఆశించినస్థాయిలో ఉండటం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు ఆకర్షణీయమైన వృద్ధి సాధించాయని సిఎం సంతృప్తి వ్యక్తంచేశారు. నదుల అనుసంధానం, ప్రాజెక్టులను పూర్తి చేయడం, నీరు- చెట్టు, మైక్రో ఇరిగేషన్, భూగర్భ జలాల సంరక్షణ, రెయిన్‌గన్ వంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో రైతుకు ఆశలు చిగురిస్తున్నాయని చెప్పారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో పైనుంచి రావల్సిన నీళ్లు అసలు రాలేదని, గోదావరి జలాలను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా తరలించడం వల్ల కృష్ణా డెల్టాకు జలసిరి దక్కిందన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ప్రతిచోటా ఫిజియో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందో ఆన్‌లైన్‌లోనే ప్రతి ఒక్కరూ తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో నీటివనరుల నిర్వణకు ‘పంట సంజీవని’ పేరిట కార్యక్రమం చేపడతామన్నారు.
దేవాదాయ శాఖ పనితీరు బావుందన్నారు. గత ఏడాదిలో 1.50 లక్షల విదేశీ పర్యటకులు రాష్ట్రాన్ని సందర్శించారని, పర్యాటక రంగంలో 800 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తిచేశామని, 6660 కోట్ల విలువైన ప్రాజెక్టులను వివిధ దశల్లో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో మొక్కలు నాటిస్తామని, ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేపడతామని తెలిపారు. మరుగు కాల్వల మరమ్మతు, పంటకాల్వల పూడికతీత కూడా చేపడతామని సిఎం పేర్కొన్నారు.