1న ఊపిరి ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. దీనికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో మార్చి 1న విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, గోపీసుందర్ మంచి పాటలను ఇచ్చాడని, నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహ బంధం ఎలా ఏర్పడింది? వారు ఆ బంధాన్ని ఎలా కొనసాగించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఆడియో హిట్ అవుతుందని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెనె్నల, రాం.జో., కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వంశీ పైడిపల్లి.