రాష్ట్రీయం

కొత్త ఏడాది సెలవులు ఇవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: వచ్చే ఏడాది (2016) సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 23 సాధారణ సెలవులు, 21 ఐచ్చిక సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 14న భోగి (గురువారం), 15న సంక్రాంతి పండుగ (శుక్రవారం), 26న గణతంత్ర దినోత్సవం (మంగళవారం), మార్చి 7న (సోమవారం) మహాశివరాత్రి, 23న (బుధవారం) హోళీ, 25న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న ((మంగళవారం) బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, 8న (శుక్రవారం) ఉగాది, 14న (గురువారం) డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి, 15న (శుక్రవారం) శ్రీరామ నవమి, జూలై 6, 7 (బుధ, గురువారాలు) రంజాన్, ఆగస్టు 1న (సోమవారం) బోనాలు, 15న (సోమవారం) స్వాతంత్య్ర దినోత్సవం, 25న (గురువారం) శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 5న (సోమవారం) వినాయక చవితి, 12న (సోమవారం) బక్రీద్, 30న (శుక్రవారం) బతుకమ్మ ఉత్సవాల ఆరంభం, అక్టోబర్ 11న (మంగళవారం) విజయ దశమి, 12న (బుధవారం) మొహర్రం, నవంబర్ 14న (సోమవారం) కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి, డిసెంబర్ 12న (సోమవారం) ఈద్ మిలాదున్ నబీ, 26న (సోమవారం) బాక్సింగ్ డేలను ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది. ఇలాఉండగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 9న దుర్గాష్టమి, అదే నెలలో 30న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ ఆదివారాల్లో వచ్చాయి.
ఐచ్చిక సెలవులు:
జనవరి 1న (శుక్రవారం), 16న కనుమ (శనివారం), 22న (శుక్రవారం) యాజ్‌దహుమ్ షరీఫ్, ఫిబ్రవరి 13న (శనివారం) శ్రీ పంచమి, 23న (మంగళవారం) హజ్రత్ సయ్యద్ మహ్మద్ జన్మదినం, ఏప్రిల్ 19న (మంగళవారం) మహావీర్ జయంతి, 21న (గురువారం) హజ్రత్ అలీ జన్మదినం, మే 5న (గురువారం) షబ్-ఇ-మీరాజ్, 21న (శనివారం) బుద్ద పూర్ణిమ, 23న (సోమవారం) షబ్-ఇ-బరాత్, జూలై 1న (శుక్రవారం) జుమ-అతుల్-వాద, 6న (బుధవారం) రథయాత్ర, ఆగస్టు 12న (శుక్రవారం) వరలక్ష్మీ వ్రతం, 17న (బుధవారం) పార్శి కొత్త సంవత్సరం, 18న (గురువారం) రాఖి పూర్ణిమ, సెప్టెంబర్ 20న (మంగళవారం) ఈద్-ఇ-గదీర్, అక్టోబర్ 10న (సోమ) మహర్ణవమి, 29న (శని) నరక చతుర్థి, నవంబర్ 21న (సోమవారం) ఆర్బీయిన్, డిసెంబర్ 24న (శనివారం) క్రిస్మస్ పండుగ దినాలను ఐచ్ఛిక సెలవు దినాలుగా ప్రకటించింది. ఇలాఉండగా, జూన్ 26న షహదత్ హజ్రత్ అలీ (ఆర్‌ఎ), జూలై 3న షబ్-ఇ-ఖదర్ పండుగలు ఆదివారం వచ్చాయి.