తెలంగాణ

మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థుల అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం,డిసెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... శనివారం మధ్యాహ్నం పై పాఠశాలలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష స్థానిక వంట ఏజెన్సీ వారితో మధ్యాహ్న భోజనంలో మిల్‌మేకర్ కూర వంటలు చేయగా ఈ పాఠశాల విద్యార్థులు భోజనాన్ని తిన్నారు. అయతే, మూడు గంటల సమయంలో పాఠశాలలోని పలువురు విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థులను తరలించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సాపూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సునీల్, బుక్య సిద్దు, ప్రతిమ, సరోజ, వనజ, నైతం సాయిరాజ్, తరుణ్‌కుమార్, అశ్విని, అఖిల, స్వప్న, సమీరా, జ్యోతి, నాగరాజు, శివతోపాటు దాదాపు పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థులు పై ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఆసుపత్రి వైద్యులు రాజేందర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. విద్యార్థులకు అన్ని వైద్య సేవలు అందించామని, విద్యార్థులకు ఎలాంటి ప్రాణహానిలేదని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఖానాపూర్ సి ఐ నరేష్‌కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థుల పరిస్థితి, వారికి అందిస్తున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు గల కారణాలు ఏమి తెలియరాలేదు.