బిజినెస్

23న వాణిజ్య శాఖ పరిశీలనకు నాలుగు సెజ్ ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 23న నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఇందులో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సెజ్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు పరిశీలనకు రానున్నాయి. కాగా, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సెజ్ ప్రతిపాదనలతోపాటు సాల్టైర్ డెవలపర్స్, అమిన్ ప్రాపర్టీస్ తాజాగా చేసిన ప్రతిపాదనలనూ పరిశీలించనుంది కేంద్రం. అలాగే 12 సెజ్ డెవలపర్ల ప్రతిపాదనలను, తమ ప్రాజెక్టులను అమల్లోకి తీసుకురావడానికి మరికొంత సమయం అడుగుతున్న మహీంద్ర వరల్డ్ సిటీ (జైపూర్), జైడస్ టెక్నాలజీస్ సెజ్‌ల విజ్ఞప్తులనూ రాబోయే సమవేశంలో పరిగణనలోకి తీసుకోనుంది. ఇదిలావుంటే మోహాలీలో 20.23 హెక్టార్ల విస్తీర్ణంలో ఇన్ఫోసిస్.. ఐటి, ఐటి అనుబంధ సెజ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇదే తరహాలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలంగాణలో ఓ సెజ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.