రాష్ట్రీయం

27న దేశవ్యాప్త బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఆందోళన మరింత తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా 27న అన్ని వర్శిటీలు బంద్ పాటించాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. దీంతో ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి విద్యార్థుల ఆందోళన అంశం తలనొప్పిగా మారుతోంది. ఇదిలావుంటే, సోమవారం చలో వర్శిటీకి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం జెఏసీని పోలీసులు అడ్డుకోడవంతో, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సోమవారం విద్యార్థులు వర్శిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహిస్తుంటే, మరోవైపు ఇతర రాష్ట్రాలు, జిల్లాలనుంచి తరలివచ్చిన వందలాది విద్యార్థులను పోలీసులు వర్శిటీ గేటుముందే అడ్డుకున్నారు. కేవలం హెచ్‌సియుకి చెందిన సిబ్బంది, విద్యార్థుల గుర్తింపు కార్డులు చూపెట్టిన వారినే లోపలికి అనుమతించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన విద్యార్థులను ఎక్కడిక్కడే అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటికే వర్శిటీలోవున్న అంబేద్కర్ మనువడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ విద్యార్థుల ఆమరణ దీక్ష వద్ద విద్యార్థి రోహిత్ స్థూపానికి నివాళి అర్పించి విద్యార్థుల ఆందోనకు మద్దతు ప్రకటించారు. కుల వివక్ష జాతీయ కమిషన్ సభ్యులు సైతం విద్యార్థుల ఆందోనకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఇన్‌చార్జి విసి శ్రీవాత్సవ్ విద్యార్థి సంఘాల జెఏసి, మరికొందరు ప్రొఫెసర్లతో చర్చించాలని ఆహ్వానించారు. అయితే, విసి అప్పారావును తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విసిని తొలగించడం తన పరిధిలో లేదని, రాష్టప్రతి ఒక్కరికే అధికారం ఉంటుందని చెప్పడంతో 15మంది అధ్యాపకులు పరిపాలనా విభాగంలోని పదవులకు రాజీనామా చేశారు. ఇదివరకే రాజీనామా చేసిన పదిమంది దళిత ప్రొఫెసర్లకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల బహిష్కరణ కమిటీలో చైర్మన్‌గా ఉన్న శ్రీవాత్సవ్‌తో రోహిత్ ఆత్మహత్య విచారణ పారదర్శకంగా సాగదని విద్యార్థి జెఎసి చైర్మన్ వెంకటేశ్ చౌహాన్ అన్నారు. మానవతావాది, ప్రజాస్వామ్య భావాలున్న వ్యిక్తిని విసిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వర్శిటీల్లో ఆందోళనలు కొనసాగుతాయని, తమ ఐదు డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, కేంద్రం నియమించిన న్యాయవిచారణ కమిటీ మూడు నెలల్లో నివేదిక అందించాల్సి ఉంది. రోహిత్ తల్లికి 8 లక్షల నష్టపరిహారం అందించింది. మరోపక్క సంఘటనలపై నిజనిర్ధారణకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించిన ద్విసభ్య కమిటీ తమ నివేదికను మంత్రిత్వ శాఖకు అందించింది. దీంతో విసిని సెలవులో పంపుతూ, ఇన్‌చార్జిని నియమించిన సంగతి తెలిసిందే. వర్శిటీలో ఇప్పటికే సస్పెండైన విద్యార్థులపై సస్పెన్షన్ తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సెలవుకాదు, సస్పెండ్ చేయాలి
వైస్ ఛాన్సలర్ అప్పారావును సెలవుపై పంపడం కాదని, సస్పెండ్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు టి జ్యోతి, కార్యదర్శి బి హైమావతిలు కోరారు. రోహిత్ కుటుంబానికి పూర్తి పునరావాసం కల్పించాలని, లాఠీఛార్జీ చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.