అంతర్జాతీయం

సౌదీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: 31 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, డిసెంబర్ 24: సౌదీ అరేబియాలో ఓ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించడంతో 31మంది దుర్మరణం చెందారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. ఐసియు, మెటర్నటీ, శిశు విభాగాలు మంటల్లో చిక్కుకున్నాయి. వాయవ్య ప్రాంతమైన జిజాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు కారణాలకు పూర్తిగా తెలియరాలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, సౌదీ అరేబియా ఈ ఏడాది వరుస దుర్ఘటనలను చవిచూసింది. క్రేన్ కూలి 111మంది దుర్మరణం చెందగా, సెప్టెంబర్‌లో హజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 2400మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. (చిత్రం) సౌదీలో అగ్నికి ఆహుతైన ఆసుపత్రి లోపలి విభాగాలు