రాష్ట్రీయం

ఆర్నెల్లు.. 60వేల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పది లక్షల డబుల్ బెడ్‌రూంలు మా లక్ష్యం టీమ్ ఇండియాగా పని చేస్తున్నాం
అమెరికా బృందానికి సిఎం కెసిఆర్ వివరణ ఫార్మాసిటీకి రానున్న కాలిఫోర్నియా కంపెనీ

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆరునుంచి ఎనిమిది నెలల కాలంలో తెలంగాణలో 60వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయనున్నాం. మొత్తం పది లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం అని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత జిలీడ్ కంపెనీ ప్రతినిధుల బృందం శనివారం సిఎంతో సమావేశమైంది. వైద్య రంగంపై అధ్యయనం చేసే ఈ కంపెనీ రీసెర్చ్ బృందం సిఎం కెసిఆర్‌ను శనివారం కలిసి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకుంది. వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి లక్ష్యాల గురించి సిఎం వారికి వివరించారు. ప్రాథమిక కేంద్రాలు మొదలుకొని రాజధాని నగరం వరకు ఆరోగ్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అందిస్తున్న సేవలను వివరించారు. మండలస్థాయిలో సైతం స్పెషలైజ్‌డ్ వైద్య సేవలు ప్రైవేటు రంగంలో అందుతున్నాయని కెసిఆర్ వివరించారు. వివిధ అభివృద్ధి పథకాల గురించి కాలిఫోర్నియా బృందం ప్రశ్నించగా, కెసిఆర్ వారికి తెలంగాణలో చేపట్టిన పలు పథకాలను వివరించారు. సింగల్‌విండో పారిశ్రామిక విధానం వల్ల సత్వరం అనుమతులు ఇస్తున్నట్టు, టిఎస్‌ఐపాస్ వల్ల పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని చెబుతూ, పాలసీ వివరాలను చూపించారు. డ్యాకుమెంట్ కాపీ అందించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల డిజైన్‌ను చూపించారు. ఆరునుంచి ఎనిమిది నెలల వ్యవధిలో 60వేల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, ఇలాంటి ఇళ్లు పది లక్షల వరకూ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గృహ నిర్మాణ పరిశ్రమకు సైతం తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారత్ అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంటూ, నీతి ఆయోగ్ గురించి వివరించారు. ప్రధాని, సిఎంలు ఒక బృందంగా టీమ్ స్పిరిట్‌తో పని చేస్తున్నట్టు చెప్పారు. ఐటి రంగం ద్వారా హైదరాబాద్, అమెరికా అనుబంధాన్ని ముఖ్యమంత్రి వివరించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని అందించేందుకు రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టినట్టు చెప్పారు. సురక్షితమైన తాగునీటిని అందించడం వల్ల రోగాలు తగ్గుతాయని, ప్రజారోగ్యం సాధ్యమవుతుందన్నారు.
వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలకు సైతం హైదరాబాద్ కేంద్రంగా ఉందని వివరించారు. టెలిమెడిసిన్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచీ రోగులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు.
1987లో ఏర్పాటైన జీలీడ్ రిసెర్చ్ సంస్థ ప్రతినిధి బృందం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసింది. ఈ బృందం వైద్యరంగంలో పరిశోధనలు చేస్తోంది. ఈస్ట్ ఆసియా, ఫసిఫిక్ సీనియర్ డైరెక్టర్ అరన్ బ్రింక్ వర్త్ నాయకత్వంలో బృందం సిఎంను కలిసింది. జిలీడ్ ప్రపంచంలోకెల్లా పెద్ద బయోమెడికల్ కంపెనీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సమీపంలో నిర్మించే ఫార్మాసిటీలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. సిఎం తన క్యాంపు కార్యాలయానికి బృందాన్ని విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో వైద్య రంగంతోపాటు వివిధ రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, ప్రణాళికలు వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, డిజిపి అనురాగ్ శర్మ, హెటిరో డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి తదితరులు సిఎంతో సమావేశమైన వారిలో ఉన్నారు.(చిత్రం) కాలిఫోర్నియాకు చెందిన జిలీడ్ ప్రతినిధులతో సమావేశమైన సిఎం కెసిఆర్