Others

ఆయుర్వేద మొక్కలపై అవగాహన ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇంటి పెరట్లోనో, చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లోనో పలురకాల మొక్కల్ని నిత్యం చూస్తూంటాం.. వాటిలో మనకు తెలియని మొక్కలు ఎన్నో.. అవి ఎందుకూ పనికిరాని పిచ్చిమొక్కలని భావిస్తాం.. వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు తెలియదు.. శారీరక అనారోగ్యాలను నివారించే ఔషధ గుణాలు ఇలాంటి మొక్కల్లో పుష్కలంగా ఉంటాయి.. ఆయుర్వేద మొక్కలపై మనలో పూర్తిస్థాయి అవగాహన కలిగితే పలురకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మందుల (అల్లోపతి) ద్వారా కొందరిలో ఇతర సమస్యలు (సైడ్ ఎఫెక్ట్సు) తలెత్తే ప్రమాదం ఉన్నా, ప్రకృతి పరంగా లభ్యమయ్యే ఆయుర్వేద మొక్కలతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఔషధ గుణాలున్న మొక్కల్లో ఆకులు, వేర్లు, తీగెలు, బెరడు.. ఇలా అన్నీ ఏదోరకంగా మనకు ఉపయోగపడేవే. అలాగే, విషప్రభావం ఉన్న మొక్కలపై కూడా అవగాహన పెంచుకున్నపుడు ఎలాంటి సమస్యలు తలెత్తవు. మన చుట్టూ కనిపించే పలురకాల మొక్కలపై అవగాహన పెంచుకున్నపుడు కొన్ని రకాల అనారోగ్యాల బారి నుంచి సులువుగా బయటపడే వీలుంటుంది. సాధారణ రోగాలు, దీర్ఘకాలిక జబ్బులు, మొండి వ్యాధులకు సైతం మొక్కలు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ‘పెరటి మొక్కే దివ్యౌషధం’ అని భావించి వాటిపై అవగాహనతో పాతతరం వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారనేది అందరూ అంగీకరించే నిజమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మొక్కలను వాడితే తక్షణం ఉపశమనం పొందే అవకాశం ఉంది.
తులసి: దీని ఆకులను చేతిలో వేసుకుని బాగా నలిపి వాసన చూస్తే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసి ఆకుల రసాన్ని తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే తులసి మొక్కలను ఇళ్లలో పెంచుకుంటే మంచి గాలి అందుతుంది.
కలబంద: ‘అలోవెరా’గా పిలిచే కలబంద మొక్కలను చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా కుండీల్లో పెంచుతుంటారు. ఇంటికి అందానే్న కాదు, ఆరోగ్యరీత్యా కూడా ఇది మనకు మేలు చేస్తుంది. కలబంద ఆకుల రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతులీనుతుంది. కీళ్లనొప్పులు, వాపులకు, మధుమేహం, చర్మసంబంధ వ్యాధులకు కలబంద ఆకులు ఉపయోగపడతాయి. నేత్ర సంబంధ సమస్యలకు, దీర్ఘవ్యాధులకూ ఆయుర్వేదంలో దీనికి ప్రాముఖ్యత ఉంది.
నేల ఉసిరి: ఖాళీ ప్రదేశాల్లో కలుపుమొక్కగా పెరిగే నేల ఉసిరి చర్మవ్యాధుల నివారణకు దోహదపడుతుంది. పాము కాట్లకు, తేలుకాట్లకు దీన్ని వినియోగిస్తారు. ఉబ్బసం, జీర్ణకోశ సమస్యలు, కామెర్లకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.
నేలవేము: విషజ్వరాలకు, కాలేయ సమస్యలకు, ఉదర సంబంధ రోగాల నివారణకు ఇది మేలు చేస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో, తోటల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది.
రామకేదారి: వాంతులు, విరేచనాలు, మూత్ర సంబంధ సమస్యలు, స్ర్తిలలో వచ్చే కొన్ని అనారోగ్యాలకు ఇది పనిచేస్తుంది. అల్లం, పసుపు మొక్కలా కనిపించే రామకేదారికి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పుదీనా: వంటకాల్లో మనం ఎక్కువగా వినియోగించే పుదీనా ఆకుల వల్ల జలుబు, దగ్గు, వొంటి నొప్పులు తగ్గుముఖం పడతాయి. దంతక్షయం నివారణకు దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే దీన్ని వౌత్ వాష్‌లు, టూత్ పేస్టుల తయారీలో విరివిగా వాడుతున్నారు.
బిళ్ల గనే్నరు: దీని ఆకుల నుంచి తీసిన రసాన్ని వాడితే మధుమేహం తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించే గుణం కూడా ఉన్నందున ఈ మొక్క ఆకుల నుంచి తీసే రసాన్ని ఇంగ్లీష్ మందుల్లోనూ వాడుతున్నారు.
మందారం: చలువ చేసే గుణం ఉన్న మందార ఆకులను ముద్దగా నూరుకుని తలకు పట్టిస్తే శిరోజాలు దృఢంగా పెరుగుతాయి. మందార ఆకులను ఎండబెట్టి వేడిచేసిన కొబ్బరి నూనెలో వేసుకుని సీసాలో నిల్వ చేసుకుని తలకు రాసుకుంటే శిరోజాలు బాగా పెరుగుతాయి.
మనకు తెలియని ఎన్నో మొక్కల్లోనూ ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. అడ్డసార, వావిలాకు రసాన్ని వాడితే చర్మసంబంధ సమస్యలు తగ్గుతాయి. తీగజాతి మొక్క అయిన పొడపత్రి ఆకులను వాడితే మధుమేహం తగ్గుతుంది. పిల్లతేగలు, పిల్లిపీచరిగా వ్యవహరించే ‘శతావరి’ వేర్లను వాడితే అజీర్తి, అల్సర్లు, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ సమస్యలు, అతిమూత్ర వ్యాధి, క్షయ వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే పెరటి మొక్కల్లోనే దివ్యౌషధాలు లభిస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఆయుర్వేద మొక్కల గురించి తెలుసుకుని, వాటిలో కొన్నింటినైనా మన ఇళ్లలో పెంచుకుంటే- చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచైనా గట్టెక్కే అవకాశం ఉంటుంది.

-సమీర