తెలంగాణ

ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలకు రక్షిత కృష్ణా మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన సిపిడబ్ల్యుపి పథకాలు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆ పథకాల మనుగడును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా కృష్ణా మంచినీటి పథకాల విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ ఐదు నెలల వేతన బకాయిల కోసం శుక్రవారం నుండి సమ్మెకు దిగారు. ఫలితంగా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత 750గ్రామాలతో పాటు జంటనగరాలకు మంచినీటి సరఫరా నిలిచిపోవడం ఆందోళనకరంగా మారింది. అసలే కరువుతో నాగార్జున సాగర్‌తో పాటు ఇతర రిజర్వాయర్‌లలో, మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటి మంచినీటి ఎద్ధడి ఎదురవుతున్న నేపధ్యంలో ఆర్‌డబ్ల్యుఎస్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగడం ప్రజల మంచినీటి కష్టాలను మరింత తీవ్రతరం చేసింది. ఆర్‌డబ్ల్యుఎస్ పరిధిలోని ఇ-1విభాగంలో 18మంచినీటి ఫ్లాంట్లు, ఇ-2విభాగంలో 10మంచినీటి ప్లాంట్లు ఉండగా వాటి పరిధిలోని మొత్తం 1000మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ఆ ప్లాంట్ల నుండి మంచినీటి సరఫరా చేసే దిక్కు లేక గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.