ఆంధ్రప్రదేశ్‌

అదనపు నీరు కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: గోదావరి డెల్టాలో రబీని కాపాడుకోవడానికి అందుబాటులో ఉన్న నీటిని సరిపెట్టుకోవటం మినహా రైతులకు మరోదారి కనిపించటం లేదు. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా గోదావరిలోకి సీలేరు జలాలను పంపాల్సిన ఎపి జెన్‌కో గోదావరి డెల్టాలో రబీ పంటను కాపాడేందుకు బైపాస్ కాలువ ద్వారా నీటిని పంపిన సంగతి విదితమే. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సమాన వాటాలు కలిగిన బలిమెల రిజర్వాయర్ నుండి ఆంధ్ర వాటాను తీసుకుని మరీ గోదావరి డెల్టాకు ఎపి జెన్‌కో సరఫరాచేసింది. అయినా సరే ఇంకా గోదావరి డెల్టాలో రబీ పంటను కాపాడుకోవాలంటే అదనంగా నీటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న వనరులన్నింటినీ వినియోగించిన రాష్ట్రప్రభుత్వం అదనంగా ఎక్కడి నుండి అదనంగా నీటిని గోదావరి డెల్టాకు సరఫరాచేయవచ్చోనన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. జలవనరులశాఖ అధికారులు ఇదే అంశంపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. గోదావరి డెల్టాలోని సుమారు 8లక్షల 50వేల ఎకరాల ఆయకట్టుకు 80టిఎంసిల నీరు అవసరమవుతుందని జలవనరులశాఖ అధికారులు ముందుగానే అంచనావేస్తే, డిసెంబర్ నుండి ఫిబ్రవరి 15వరకు సుమారు 53టిఎంసిల నీటిని వినియోగించారు. ఇంకా 27టిఎంసిలు ఉంటే తప్ప గోదావరి డెల్టాలో రబీ గట్టెక్కే పరిస్థితి లేదు. రకరకాల విధానాల్లో సాగునీటి సరఫరాను నియంత్రించి సరఫరాచేయటం ద్వారా మరో 20టిఎంసిలు వరకు రబీకి సరఫరాచేసేందుకు అవకాశం ఉంది. మార్చి 31నాటికి రబీ పూర్తిచేయాలని చెప్పినప్పటికీ, ఆలస్యంగా సాగు మొదలవటంతో ఏప్రిల్ 15నాటికి పూర్తిస్థాయిలో గోదావరి డెల్టాలో రబీ చేతికొచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఏప్రిల్ 5వరకు అదనపు జలాలు గోదావరి డెల్టాకు సరఫరాచేయగలిగితే, తరువాత నుండి తేలికగా రబీని గట్టెక్కించగలని జలవనరులశాఖ అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 7టిఎంసిలు, మార్చినెలతో పాటు, ఏప్రిల్ 5వరకు కలిపి మరో 20టిఎంసిలు ఉంటే సరిపోతుందని జలవనరులశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.