తెలంగాణ

ఆంధ్రా బ్యాంకులో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్‌లో సోమవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. దుండగులు బ్యాంకులో అమర్చిన సిసి కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సుమారు 60 నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒక లాకర్‌లో నాలుగు బాక్సులుంటాయి. వీటిలో ఒక బాక్స్‌ను మాత్రమే దుండగులు ఎత్తుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును కూడా దుండగులు దోచుకెళ్లినట్టు తెలిసింది. కానీ ఈ విషయాన్ని అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. దుండగులు షట్టర్ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించినట్టు తెలిసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, చోరీపై సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ కొందరు ఖాతాదారులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఘట్‌కేసర్‌లోని ఓ బ్యాంకులోని ఖాతాదారుల సొమ్మును ఇతర బ్యాంకుల్లోకి మళ్లిన ఘటనపై కేసు కొనసాగుతున్న విషయం విధితమే. తాజాగా జరిగిన చోరీతో ఖాతాదారుల్లో భయాందోళన వ్యక్తమవుతుంది. సుమారు వంద మంది ఖాతాదారులు తమతమ లాకర్లకు చెందిన సమాచారం ఇవ్వాలని కోరుతూ బ్యాంకు ముందు బైఠాయించారు. దీంతో బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ ఖాతాదారులందరికీ సముదాయించారు. మీ సొమ్ముకు భద్రత ఉందని, మీ లాకర్లలోని బంగారానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు. ఏ ఒక్క ఖాతాదారుడికి కూడా అన్యాయం జరగదని ఆయన భరోస ఇచ్చారు. దీంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు.
సొమ్ము చెల్లింపు బాధ్యత
బ్యాంకుదే : డిజిపి శంకరయ్య
ఆంధ్రాబ్యాంకులో చోరీకి గురైన సొమ్ము తిరిగి చెల్లించే బాధ్యత బ్యాంకుదేనని ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకరయ్య తెలిపారు. బ్యాంకులో తాకట్టుపెట్టుకున్న బంగారం మాత్రమే చోరీకి గురైందని, మిగిలిన బంగారం, నగదు లాకర్లలో సురక్షితంగా ఉందని తెలిపారు. దుండగులు బ్యాంకు కంప్యూటర్లకు సంబంధించిన కనెక్షన్లను తొలగించారని, వాటిని సరి చేసి రేపటి నుంచి బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తామని డిజిఎం వివరించారు.