తెలంగాణ

ఆందోళన బాటలో 108 సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న 108 వాహన సిబ్బంది తిరిగి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. 108 సర్వీస్ కింద మొత్తం 1600 మంది వరకు పని చేస్తున్నారు. 108 సర్వీస్‌ను నిర్వహిస్తున్న జివికె సంస్థ సిబ్బంది సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015 మే 13 నుంచి సమ్మె చేపట్టడంతో స్పందించిన ప్రభుత్వం మే 24న శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్, గాదరి కిషోర్‌తో కూడిన ద్విసభ్య కమిటీని ప్రభుత్వం నియమించి చర్చలు జరిపింది. 108 ఉద్యోగులు తమ సమస్యలపై విన్నవించుకోగా, లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేక అందించింది. కానీ ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని 108 వాహన సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి. పలుసార్లు జివికె సంస్థతో చర్చలు జరిపినా తమకు ఉన్న వేతన, సౌకర్యాలు, మహిళా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో తిరిగి ఆందోళన బాట పట్టేందుకు యోచిస్తున్నారు.
కొడుకు పాసైపోయాడు..
మేనల్లుడి ఫలితం నేడు!
‘ఖేడ్’ ఫలితంపై కెసిఆర్ ఆసక్తి ౄ గెలుపుపై తెరాస నేతల ధీమా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కెటిఆర్ భారీ మార్కులు సాధించారు. ఇక హరీశ్‌రావు పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఇంత కాలం ఈ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందంటూ ప్రచారంతో హోరెత్తించిన హరీశ్ మరోవైపు ఆస్పత్రి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం మంజూరు చేసి ఆ పనులు ప్రారంభమయ్యేలా చేశారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే నియోజకవర్గంలో కొన్ని పనులు ప్రారంభం కావడంతో టిఆర్‌ఎస్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇలా హరీశ్ ఓటర్ల అభిమానం సంపాదించారు. పైగా ఖేడ్‌లో టిఆర్‌ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, తమ ఆలోచనంతా మెజార్టీ ఎంత వస్తుందనేదేనని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గతంలో టిఆర్‌ఎస్‌కు పెద్దగా పునాది లేదు. నారాయణఖేడ్‌లోనూ దాదాపు అదే పరిస్థితి. కెసిఆర్ సొంత జిల్లాలోని నియోజకవర్గమే అయినా నారాయణఖేడ్‌లో తెలంగాణ ఉద్యమ ప్రభావం తక్కువ. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఉద్యమ ప్రభావం పడలేదు. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టిఆర్‌ఎస్ ఓడిపోయింది రెండే రెండు నియోజక వర్గాలు. అవి నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు. గ్రేటర్ ఎన్నికల సమయంలో హరీశ్‌రావు మెదక్ జిల్లా పరిధిలోని పటాన్ చెరు ప్రాంతంలో మాత్రమే ప్రచారం చేశారు. పూర్తిగా నారాయణఖేడ్‌పైనే దృష్టిసారించారు. కాంగ్రెస్‌కు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో హరీశ్‌రావు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, ముఖ్యమంత్రి కాళ్లు మొక్కయినా అభివృద్ధి చేసి చూపిస్తానని పదే పదే ప్రకటించడం ఓటర్లపై ప్రభావం చూపింది. ఉప ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికలను మించి 82 శాతం పోలింగ్ జరగడంతో భారీ మెజారిటీపై టిఆర్‌ఎస్ అంచనాలు పెట్టుకొంది.