జాతీయ వార్తలు

ఆధారాలు చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఢిల్లీలోని జెఎన్‌యులో ఇటీవల జరిగిన అఫ్జల్‌గురు సంస్మరణ కార్యక్రమం వెనక లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సరుూద్ హస్తం ఉందంటూ హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై రెండోరోజైన సోమవారం కూడా తీవ్రస్థాయిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ ఇటు రాజకీయ రంగానికి, అలాగే ఇతర రంగాలకు చెందిన అనేకమంది హోమ్ మంత్రిపై వత్తిడి తీసుకొస్తున్నారు. మరోపక్క ఢిల్లీ జెఎన్‌యు కార్యక్రమంలో లష్కరె హస్తం ఉన్నట్టుగా తమకు ఎలాంటి ఆధారం లభించలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఈ విషయంలో వాస్తవాలు వెల్లడించాలంటూ రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా జెఎన్‌యులో జరిగిన అఫ్జల్‌గురు సంస్మరణ కార్యక్రమానికి లష్కరే తొయిబా మద్దతు ఉన్నట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఒకవేళ అలాంటి ఆధారాలు బయటపడితే హోమ్ మంత్రిత్వశాఖకు తెలియజేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ స్పష్టం చేశారు. జెఎన్‌యు కార్యక్రమాన్ని మతపరమైన అంశంగా చిత్రించేందుకు రాజ్‌నాథ్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విరుచుకుపడింది. అలాగే భారత్‌పై దాడులకు ఒడిగడుతున్న హఫీజ్‌ను అరెస్టు చేయాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కోరాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి గట్టిగా విజ్ఞప్తి చేసింది.