జాతీయ వార్తలు

ఆర్థిక బంధమే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రాంతీయ భద్రత, ఆర్థిక సంబంధాలే ప్రధాన అజెండాగా భారత్-ఆసియాన్‌ల మధ్య బుధవారం నుంచి రెండు రోజుల పాటు శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ ఎనిమిదో సమావేశానికి ఆసియాన్ దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారని విదేశాగం మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ వాద్వా వెల్లడించారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ జరుగుతుందని, భారత్-ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై విస్తృత చర్చలు జరుగుతాయన్నారు. ఈ రెండ్రోజుల సదస్సులో రాజకీయ నాయకులు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు కూడా హాజరవుతారని వాద్వా వెల్లడించారు. ఇటీవల కాలంలో భారత్-ఆగ్నేయాసియా దేశాల కూటమి మధ్య అన్ని విధాలుగా సహకారం పెంపొందిందని ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉద్దేశించిన నిధి ఒక మిలియన్ డాలర్ల నుంచి ఐదు మిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆవిష్కరణ చేయడమే లక్ష్యంగా ఆసియాన్-్భరత్ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టుగా వాద్వా వెల్లడించారు. ఇందులో భాగంగా 500కోట్ల రూపాయల మూలధనంలో ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ యోచిస్తోందని తెలిపారు.