ఆంధ్రప్రదేశ్‌

అభిప్రాయభేదాలున్నా టిడిపితో సర్దుకుపోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని బిజెపి నేతలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్బోధించారు. విశాఖ పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్ స్థానిక బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. టిడిపి, బిజెపిల మధ్య చిన్నపాటి అభిప్రాయబేధాలు ఉన్నా సర్దుకుపోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తోందని చెప్పారు. 1.2 శాతం నుంచి రెండు శాతం వరకు ప్రీమియం చెల్లిస్తే పంట నష్టపోయిన రైతులకు బీమా అందుతుందన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతు సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలియచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బిజెపి శ్రేణులపై ఉందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. బిజెపి మరింత బలపడేలా పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, నగర అధ్యక్షుడు నాగేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.