ఆంధ్రప్రదేశ్‌

అసైన్డ్ భూములకు తుదిగడువు 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 19: ఈ నెల 28వ తేదీ లోపు అసైన్డ్ భూముల యజమానులు తమ అంగీకార పత్రాలను సమర్పించాలంటూ జిఓ 41ని ప్రభుత్వం విడుదల చేసింది. జిఓ ప్రకారం అసైన్డ్ భూముల రైతులకు 1000 గజాల ఇళ్ల స్థలం, 200 గజాల వాణిజ్యస్థలం కేటాయిస్తారు. జరీబు రైతులకు ఇళ్ల స్థలంతోపాటు 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించనున్నారు. అసైన్డ్ భూముల రైతులు తమ అంగీకారాన్ని తెలియజేస్తూ సిఆర్‌డిఎ అధికారులకు పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. పట్ట్భాముల రైతులకు రాష్ట్రప్రభుత్వం గత ఏడాది జనవరి 2వ తేదీన భూసమీకరణ విధానాన్ని అమలు చేసింది. అప్పటి నుంచి అసైన్డ్ రైతులు తమ భూములకు సంబంధించిన ప్యాకేజి ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసైన్డ్ రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం తక్షణమే రైతుల సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించక పోవటంతో అసైన్డ్ భూములకు ప్యాకేజి ఇవ్వదనే భయంతో అనేక మంది యజమానులు తమ భూములను అమ్ముకున్నారు. ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున కొనుగోలు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సిఆర్‌డిఎ నిబంధనలోని లొసుగును ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశాలు న్నాయి. రాజధానికి రైతులు భూములిచ్చినప్పటికీ అమ్ముకునేందుకు అన్ని విధాలా సహకరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా సిఆర్‌డిఎ చట్టంలో వెసులుబాటు ఉందని మంత్రులు స్వయంగా ప్రచారం చేశారు. ఈనేపథ్యంలో రైతులు భూసమీకరణ కింద భూములిచ్చినప్పటికీ అనేక మంది కొంత భూమి అమ్ముకుని వేరే ప్రాంతాల్లో పొలాలు కొనుగోలు చేశారు. అయితే అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదేమోననే భయంతో యజమానులు కొంతమంది అమ్ముకున్నారు. ఆ భూములను కారుచౌకగా కొనుగోలు చేసిన వారు ప్రజాప్రతినిధులు కావటంతో ప్రభుత్వంలో చక్రం తిప్పి ప్యాకేజీని ప్రకటించుకున్నారని అమ్మిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 5 లక్షలకు మెట్ట భూములు, 20 లక్షల రూపాయల లోపు జరీబు భూములు అమ్ముకున్నట్లు తెలియజేస్తున్నారు. అసైన్డ్ భూముల యజమానులు అమ్ముకున్నప్పటికీ సిఆర్‌డిఎ అధికారులకు అంగీకార పత్రాలు అందజేసే అధికారం ఉంది. అందువల్ల కొనుగోలు చేసిన వారి పేర్లు బహిర్గతం అయ్యే అవకాశం లేదు. దీంతో అసైన్డ్ భూముల రైతులు అమ్ముకున్న విషయం బహిర్గతం చేస్తున్నప్పటికీ సిఆర్‌డిఎ నిబంధనల ప్రకారం అంగీకార పత్రం ఇచ్చే అవకాశం ఉంది.