అనంతపురం

జూలై 5నసిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, జూన్ 13: ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 5న విస్తృతంగా పర్యటించడంతోపాటు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫోన్‌లో సిఎం పర్యటన వివరాలను తెలిపారు. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు రూ.111 కోట్ల నిధులను జూలై 5న ఉదయం 11గంటలకు ధర్మవరంలో చేనేతల సమక్షంలో విడుదల చేస్తారని తెలిపారు. అలాగే కదిరి గేట్ వద్ద రూ.40 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అంతేగాక ధర్మవరం తాగునీటి పథకానికి రూ.18 కోట్లతో, గ్రామీణ ప్రాంతాలకు నాబార్డు నిధులు రూ.25 కోట్లతో తాగునీటి పథకాలకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. రూ.34 కోట్ల నిధులతో ధర్మవరం చెరువుకు నీరందించే కాలువ లైనింగ్, పూడికతీత పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ధర్మవరం పట్టణ పరిధిలో నాగలూరు నుంచి ఎన్‌ఎస్.గేటు ఆంజనేయస్వామి గుడి దాకా రూ.34 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే పిఎబిఆర్ కుడి కాలువ నుంచి సిబిఆర్‌లోకి వెళ్ళే కాలువ నిర్మాణానికిగాను రూ.13కోట్ల నిధులతో చేపట్టే పనులకు, ధర్మవరం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బి ద్వారా రూ.30 కోట్లతో నిర్మించే రహదారులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అదేరోజు రూ.35 కోట్లతో నిర్మాణమైన పోతుకుంట రైల్వే ఓవర్ బ్రిడ్జిను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం జరుగుతుందన్నారు. సాయంత్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.