అక్షర

నిజంగా ‘వైభవమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు విభవం
(ఆచార్య జె.ప్రతాపరెడ్డి
షష్టిపూర్తి ప్రత్యేక సంచిక)
సంపాదకులు: డా.ఎల్వీకె, డా.పి.సి.వెంకటేశ్వర్లు
వెల: రూ.300/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక విక్రయ కేంద్రాలు.

రజతోత్సవం, స్వర్ణోత్సవం, షష్టిపూర్తి, అమృతోత్సవం వంటి వేడుకలు జరుపుకునే సందర్భంలో ఆ వ్యక్తి స్థాయినిబట్టి మంత్రులు, నాయకులు, ప్రముఖుల ఛాయాచిత్రంతోపాటు సందేశాలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆ వ్యక్తి జీవిత విశేషాలు, కృషి వివరాలు, రంగుల ఛాయాచిత్రాలు, అధిక సంఖ్యలో వాణిజ్య ప్రకటనలు వగైరాలతో పెద్ద గ్రంథం ప్రత్యేక సంచిక పేరుతో వెలువరించటం పరిపాటి. సమీక్షిస్తున్న ‘తెలుగు విభవం’ ఒక ప్రత్యేక సంచిక అంటే విషయంలో ఆకృతిలో నమ్మశక్యం కాదు. అదొక ప్రామాణిక సాహితీ గ్రంథంగా రూపొందించారు. ఆచార్య జంగా ప్రతాపరెడ్డి షష్టిపూర్తి ప్రత్యేక సంచికే ఈ ఉత్తమ గ్రంథమంటే దీన్ని చదివినవారు విశ్వసిస్తారు. సాహిత్య లోకంలో ఇలాంటి ఆశ్చర్యకర సన్నివేశాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఇది పరిశోధన వ్యాస సంకలనంగా రూపుదిద్దుకుంది. ఇందులో 31 వ్యాసాలున్నాయి. (231 పుటలు). వ్యాసకర్తల్లో 19 మంది ఆచార్యలు, మిగిలిన 12 మంది డాక్టర్లు. వ్యాసాల్లో భాషాశాస్త్రానికి ప్రాధాన్యమిచ్చారు. ఆచార్య రెడ్డి ప్రసిద్ధ భాషా శాస్తవ్రేత్త కావడమే ఇందుకు కారణం. విద్యారంగానికి 37 సం.లు విశేషలందించి 2012లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పదవీ విరమణ గావించారు. అప్పుడే ఈ షష్టిపూర్తి సంచికను సాహితీ లోకానికి గొప్ప కానుకగా అభిమానులు బహుకరించారు. ‘‘ఆయన భాషాబోధనకు కృతజ్ఞతా రూపంలో చిన్న కానుకగా’ ‘తెలుగు విభవం’ పేరుతో ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నాం’ అని సంపాదకులు తెలియజేశారు. ఆచార్య రెడ్డికి ఆంగ్లంలో కూడా ఎంతో ప్రవేశముంది. ‘తెలుగు అకాడమీ’ సంచాలకులుగా ఆయన పాలనాదక్షత నిరూపితమయింది. ఆయన వైలక్షణ్యాన్ని విశదీకరిస్తూ సంపాదకులు ‘శిష్యులపై వాత్సల్యం, స్నేహితులపై అనురాగం, ఆదరాభిమానాలు ఆయన ప్రత్యేక సుగుణాలు’ అన్నారు.
వ్యాసకర్తలందరూ సాహితీ నిపుణులు. ప్రతి వ్యాసంలోను పాఠకులను అలరించే, ఆలోచింపజేసే విశేషాలెన్నో నిక్షిప్తమైవున్నాయి. వాటిని పేర్కొనడానికి చిన్న గ్రంథమే అవసరమవుతుంది. అందుచేత ఈ సమీక్షా పరిమితిని దృష్టిలో వుంచుకుని స్థాలీపులాకంగా కొన్ని వ్యాసాలను మాత్రమే ప్రస్తావించేందుకు సాధ్యమవుతుంది. ‘ఆధునిక అలవాట్లుగల వాళ్లందరూ ఆధునికులు కానట్లే ఆధునిక ప్రక్రియలు రాసే వాళ్లందరూ ఆధునిక రచయితలు కారు. వాళ్ల రచనలూ ఆధునికాలు కావు’ అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సూత్రీకరించారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం దేశిపదాల గురించిన వ్యాసంలో ‘దేశిపదాల దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరూ సూత్రీకరణలకు పూనుకోలేదు. సదరు దేశిపదాలు వినియోగంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడి సంప్రదాయాన్నిబట్టి వాటిని తెలుసుకోండి అని చెప్పి వదిలేశారు’ అని వివరించారు. ఇది ప్రత్యేక సంచిక అన్నారు కాబట్టి లాంఛనంగా, అతి సంగ్రహంగా ఆ లక్షణాలు ఎలా వున్నాయో చూపడం సముచితం. మచ్చుకు ఒక్క వాణిజ్య ప్రకటనైనా ఇందులో లేదు. రచయితల ఛాయాచిత్రాలు లేకుండా కొందరి శుభాకాంక్షలు, షష్టిపూర్తి- పదవీ విరమణ నలుపు-తెలుపు ఛాయాచిత్రాలు గ్రంథం చివర్లో కలిపారు. కేవలం 28 పుటలు ప్రత్యేక సంచికలకిదొక మార్గదర్శి. పరిశోధకులకు ప్రయోజనకర గ్రంథం. నిర్వాహకుల ఆలోచన, కృషి ప్రశంసనీయం.

-జిఆర్కె