గుంటూరు

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర సమాచార, పౌరసరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో మోకీలు శస్త్ర చికిత్స చేయించుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్‌ను శనివారం పరామర్శించిన మంత్రి పల్లె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యాన్ని అందించాల్సి బాధ్యత వైద్యులు, నర్సులపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 500 కోట్ల విలువైన పరికరాలున్నాయని, వాటిల్లో 180 కోట్ల విలువ గలిగిన పరికరాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. కొత్త పరికరాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గర్భిణులు ప్రసవం అయిన తర్వాత వారిని క్షేమంగా ఇంటి వద్దకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ప్రారంభించిందన్నారు. తల్లి, బిడ్డల రక్షణ పట్ల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవటం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి కామినేని నిర్ణయం ఆదర్శం కావాలన్నారు. శస్త్ర చికిత్స విజయవంతం చేసిన డాక్టర్లను మంత్రి పల్లె అభినందించారు. ఆనంతరం మంత్రి పల్లె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని మంత్రి పల్లె పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న మంత్రి కామినేనితో వెబ్ కెమెరాలో మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, ప్రత్యేక అధికారి ఎస్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.

మాతృ భాషతోనే ఎనలేని గౌరవం
తాడేపల్లి, జనవరి 23: నూతనంగా చదువు ముగించుకుని కెరీర్ ప్రారంభించబోతున్న యువతీ యువకులు మాతృభాషను విడనాడరాదని మాతృ భాషతోనే అనన్యమైన గౌరవం వస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరంలోని కెఎల్ యూనివర్శిటీలో జరిగిన 5వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక భారతదేశానికి స్ఫూర్తి అయిన యువత విశేష సంఖ్యలో ఉండటం ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో 140 మిలియన్ల యువత ఉంటుందని అంచనాలు చెబుతున్నాయని అన్నారు. ప్రస్తుతం తయారవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌లో కేవలం 25 శాతం మాత్రమే మెరుగైన ఉద్యోగాలకు అర్హత సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీలు 1.3 మిలియన్ల అభ్యర్థులను వడపోయగా వారిలో కేవలం 2 శాతం మాత్రమే ఉద్యోగార్హతలు కలిగి ఉన్నట్లు తేలిందన్నారు. పలు విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు కనీస స్థాయిలో ఉన్నాయనటానికి ఇది ఒక ఉదాహరణమన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు నిజమైన విద్య వ్యక్తిత్వ వికాసం, తెలివితేటలను మెరుగుపరచటం, మనోబలాన్ని పెంపొందించటం వంటి వాటిని అందించేదిగా ఉండాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ విధంగా చేయటం వలన ప్రపంచానికి మార్చగల సత్తా మన దేశ యువకులు అలవర్చుకోగలరన్నారు. కార్యక్రమానికి హాజరైన మరొక విశిష్ట అతిథి, రక్షణ మంత్రిత్వ సలహాదారుడు, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్శిటీలో విద్యార్థులు నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో నూతన కల్పనలు, ఉత్పత్తులు సాధించాలని అన్నారు. అనంతరం కెఎల్ యూనివర్శిటీ నుంచి అనేక విభాగాల్లో పట్ట్భద్రులైన యువతీ యువకులకు ప్రతిభా పత్రాలు అందజేశారు. ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో 15 మంది స్కాలర్లకు గౌరవ పిహెచ్‌డిలు ప్రదానం చేశారు. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, డిగ్రీలు అందుకున్న విద్యార్థులను అభినందించారు.
బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఎం.డి
గుంటూరు (కొత్తపేట), జనవరి 23: గుంటూరు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌ను ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు శనివారం తనిఖీ చేశారు. బస్‌స్టేషన్‌లో నూతనంగా నిర్మించి ఆధునీకరించిన టాయిలెట్స్, దృశ్య, శ్రవణ పరికరాలు అమర్చిన ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చైనా చైర్స్, పారిశుద్ధ్యం, అధికారుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పే అండ్ యూజ్ టాయిలెట్లకు అడ్డుగా ఉన్న టేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. బస్‌స్టేషన్‌లో సౌండ్ సిస్టమ్‌పై సాఫ్ట్‌వేర్ కాంట్రాక్టర్ కొండలుకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈ ఏడాది సంక్రాంతికి సంస్థకు అధికంగా ఆదాయం సమకూరిందన్నారు. స్పెషల్ బస్సులకు 50 శాతం ఛార్జీలు పెంచుకునే అవకాశం ప్రభుత్వమే కల్పించిందని, అయినప్పటికీ ప్రైవేటు వాహనాలతో పోలిస్తే తక్కువ ఛార్జీలకే ప్రయాణికులకు అందుబాటులో ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 12 వేల బస్సులుంటే 2 వేల బస్సులు మాత్రమే స్పెషల్ బస్సుల కింద నడుపుతున్నట్లు తెలిపారు. మిగిలిన బస్సులన్నీ రోజువారీ ఛార్జీలతో నడుస్తున్నవేనన్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయితే గంటలోపలే వాటి స్థానంలో వేరే బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రిజర్వేషన్ సంఖ్య పెరిగేకొద్దీ బస్సులు కూడా అందుబాటులోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పే అండ్ యూజ్ టాయిలెట్స్‌పై న్యాయవాది పివి సుబ్బారావు ఎం.డిని ప్రశ్నించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన సంస్థ టాయిలెట్స్ ఉపయోగించుకున్నందుకు 5 రూపాయలు చెల్లించాలని షరతులు విధించడం సమంజసం కాదన్నారు. 5 రూపాయల రేటును ఎత్తివేయాలని కోరగా ఈ విషయంపై ఎండికి న్యాయవాది మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆదాయం కోసం కాదన్న విషయాన్ని
ప్రయాణికులు గుర్తించాలన్నారు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం నెలకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, రోజుకు వేల మంది ఒకేచోట మలమూత్ర విసర్జన చేయడం వలన అపరిశుభ్రత నెలకొనే ప్రమాదమున్న దృష్ట్యా, దీని నివారణకు మాత్రమే సంస్థ ఈ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ యత్నాలకు ఐక్య ఉద్యమం అవశ్యం
మంగళగిరి, జనవరి 23: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా పావులు కదుపుతోందని, బ్యాంకు ఉద్యోగులు ఐక్యంగా ఉండి ఉద్యమం చేయాల్సిన అవశ్యం ఉందని ఆలిండియా బ్యాంక్ ఎంప్లారుూస్ యూనియన్ ముఖ్య కార్యదర్శి బిఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరువద్ద గల హ్యాపీరిసార్ట్స్‌లో రెండురోజుల పాటు జరిగే సిండికేట్ బ్యాంక్ ఎంప్లారుూస్ యూనియన్ 14వ ఎపి, తెలంగాణా రాష్ట్ర మహాసభలు శనివారం రాత్రి ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా మహాసభలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రాంబాబు ప్రసంగిస్తూ 112 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న బ్యాంకులను 1969లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీరుూకరణ చేసిందని, నేడు ఎన్‌డిఎ ప్రభుత్వం బ్యాంకులను తిరిగి ప్రైవేటీకరించే పనిలో ఉందన్నారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో నేటికీ సామాన్య ప్రజలు ఖాతాలు తెరవలేని పరిస్థితులు నెలకొన్నాయనే విషయం ఎన్‌డిఎ ప్రభుత్వం గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపైనా ఉందని రాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిండికేట్ బ్యాంక్ యూనియన్ ఎంతో చరిత్ర కలిగి ఉండటం అభినందనీయమని, ఉభయ రాష్ట్రాల్లో 1800 మంది సభ్యులు యూనియన్‌లో సభ్యత్వం కలిగి ఉందన్నారు. నరేంద్రమోడి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తోందని రాంబాబు విమర్శించారు. మోదీ విదేశాల పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రధాని , ఆయన మంత్రివర్గ సభ్యులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను వినియోగించుకుంటూ ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జన్‌ధన్, ముద్ర రుణాల పేరుతో దేశంలోని యువతకు పరిశ్రమలు స్థాపించుకునేందుకు వాణిజ్యబ్యాంకులు చేయూతనివ్వాలని చెబుతున్నారని, ఇప్పటికే ఆ బ్యాంకులకు దాదాపు 3 లక్షల కోట్లు రాని బాకీలు ఉన్నాయని, దేశంలో కేవలం 55 మంది చేతుల్లో 75వేల కోట్ల రూపాయలు రానిబాకీలు పెరుకుపోయి ఉన్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులు సంపదను సృష్టిస్తుంటే ఆ సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు పాలకులు కుయుక్తులు పన్నడం బాధాకరంగా ఉందన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై వచ్చే మార్చి 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన మార్చ్ 2 పార్లమెంట్ కార్యక్రమానికి ఉద్యోగులంతా పెద్దసంఖ్యలో తరలి రావాలని రాంబాబు పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మున్వర్ భాషా, ఆలిండియా ప్రెసిడెంట్ జెపి శర్మ, సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎం ప్రసాద్, ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ శ్రీవాస్తవ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ అయ్యర్, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు సత్యభామ, ఫణిభూషణ్ శర్మ, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, సిండికేట్ బ్యాంక్ డిప్యూటచ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పద్మ, ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి, బొమ్మదేవర బాబు, లాజర్, ప్రసాద్, పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 1200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

కోటప్పకొండ తిరునాళ్లను తలపించిన జాతీయ ఎడ్లపోటీలు
* చివరి రోజు పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి
చిలకలూరిపేట, జనవరి 23: చివరి రోజు చిలకలూరిపేట పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు కోటప్పకొండను తిరునాళ్లను తలపించాయి. పట్టణంలోని దివంగత మల్లెల సత్యనారాయణ ప్రాంగణంలో జరుగుతున్న ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన పోటీలు శనివారం ముంగిపునకు చేరుకున్నాయి. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి 6వ రోజు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు తెలుగుజాతికి ప్రతీకలన్నారు. ప్రతిరైతు ఎడ్లను పెంచుకునేవిధంగా ఈ పోటీలు ఆదర్శాన్నిస్తున్నాయన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం ఆయనకు ఒంగోలు జాతి ఎడ్లపై ఉన్న ప్రేమను నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రంలోని ప్రతిరైతుకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ఉచిత విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ముఖ్యమంత్రికి రైతుల పట్ల గల ప్రేమకు నిదర్శనమన్నారు. మంత్రి పల్లె తలపాగాతో కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రాంతంలో మునుపెన్నడూ లేనివిధంగా పోటీలు నిర్వహించడం వెనుక కొన్ని వందల మంది కృషి ఉందన్నారు. ఆర్థికంగా కష్టపడి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుండి పోటీలను నడిపించిన ధనలక్ష్మి సంస్థల డైరెక్టర్ పేర్ని వీరనారాయణ, మల్లెల రాజేష్ నాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. బందోబస్తు నిర్వహించిన పోలీసు శాఖ కృషిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. చివరిరోజు సీనియర్ విభాగంలో జరిగిన పోటీలను తిలకించడానికి సుమారు 50 వేలకు మంది పైగా హాజరై ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఎఎంజి సంస్థ డైరెక్టర్ అరుణ్‌కుమార్ మహంతి, పార్‌కార్నర్స్ డైరెక్టర్ బర్నబాస్, తేళ్ల సుబ్బారావు, మానం వెంకటేశ్వర్లు, అబ్దుల్ కుమీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్‌రెడ్డి కేక్ కట్ చేశారు.
వర్సిటీల్లో వివక్ష అరికట్టాలి
- రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలి
- నాగార్జునలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 23: దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో వివక్ష అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మృతికి యూనివర్సిటీలో ఉన్న వివక్షే కారణమని, దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన కేంద్ర మంత్రులను, హెచ్‌సియు వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నాగార్జున వర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న విద్యార్థులు కేంద్ర మంత్రులు, హెచ్‌సియు వీసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన పరిశోధక విద్యార్థి రోహిత్ మృతికి పరోక్షంగా కారణమైన కేంద్ర మంత్రులు, హెచ్‌సియు వీసీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనకు కారణమైన హెచ్‌సియు వీసీని వెంటనే పదవీ నుండి తొలగించాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేయనున్నామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌డిఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘనేతలు పాల్గొన్నారు.

డీలర్ల నిర్లక్ష్యం, సాంకేతిక పరిఙ్ఞన లోపం కారణానే రేషన్ పంపిణీ ఆలస్యం
* ఈ-పాస్ విధానంతోనే కార్డులదారులకు మేలు
--- జిల్లా పౌరసరఫరాల అధికారి చిట్టిబాబు
తెనాలి, జనవరి 23: జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ జరుగుతున్న రేషన్ సరుకులు లబ్ధిదారులకు సకాలంలో అందకపోవడానికి కొందరు డీలర్ల నిర్లక్ష్యం, సాంకేతిక పరిఙ్ఞనం లేకపోవటం కారణమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ-పాస్ విధానంపై అపోహలు తొలగించేందుకు డివిజన్ పరిధిలోని డీలర్లు, రెవెన్యూ అధికారులకు శనివారం స్థానిక జెఎంజె కళాశాల ఆడిటోరియమ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్‌ఓ మాట్లాడుతూ మూడు దఫాలుగా జిల్లాలోని 57 మండలాలలో సెప్టెంబర్ నుండి అన్నిచోట్ల ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 2727 షాపులున్నాయని, ఎక్కడా అసౌకర్యం లేకుండా సరుకుల పంపిణీ జరుగుతుందని వివరించారు. వేలిముద్రలు సరిగా పడకపోడానికి లబ్ధిదారుల చేతులకుండే మలినాలు, నూనె మరకలు కారణాలుగా చెప్పారు. వేలిముద్రలు సరిపోలకపోతే ఐరిష్ ద్వారా రేషన్ ఇవ్వవచ్చునన్నారు. ముఖ్యంగా ఆధార్ సీడింగ్ సక్రమంగా జరగక పోవటం, రెండు ఆధార్ కార్డులున్నవారు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు సరుకుల పంపిణీ సమయ పాలన పాటిస్తూ లబ్ధిదారులకు అందించాలని డీలర్లను ఆదేశించారు. 20 తరువాత ఎట్టి పరిస్థితులలో ఈ-పాస్ యంత్రం సరుకులు ఇవ్వడానికి సహకరించదన్నారు. రాష్టమ్రంతటా ఒకే విధానం అమలులో ఉన్నప్పుడు మినహాయింపు ఉండదని చెప్పారు. యంత్రాంగం ప్రతి రోజూ శుభ్రపరుచుకోవటం వల్ల 30 సెకన్లలో రేషన్‌దారునికి సరుకులు అందజేయవచ్చునన్నారు. ప్రొజెక్టర్ ద్వారా ఈ-పాస్ యంత్రం పనితీరు వివరించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ జి నరింహులు, డివిజన్ పరిదిలోని 18మండలాల తహశీల్దార్‌లు, సిఎస్ డిటిలు, విఆర్‌ఓలు, డీలర్లు పాల్గొన్నారు.