Others

అనే్వషణా ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాల్లో హైందవ ధర్మ శంఖారావాన్ని పూరించిన ధీశాలి వివేకానందులు. రామ్‌మోహన్ దత్త, దుర్గాచరణ్ దత్త, విశ్వనాధ దత్త మొదలైన సుప్రసిద్ధ దత్త కుటుంబ పరంపరలో విశ్వనాధ దత్త, భువనేశ్వరీ దేవి దంపతులకు కారణజన్ముడుగా ఉద్భవించారు. పేరుకు తగ్గట్టుగానే ఆధ్యాత్మిక లోకానికి ఇంద్రుడై హైందవ ధర్మముయొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
హైందవ ధర్మ రక్షణ కోసం దివినుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ నరేంద్రుడు. నిద్రకు ఉపక్రమించగానే ఒక దివ్య జ్యోతి ఆయన మస్తిష్కంలో కనపడేదట. దానిలో లీనమై వుండేవాడట. అదే నిద్రని అందరూ అలాగే నిద్రిస్తారని భావించేవాడట. కాని అది నిత్యం తాను ధ్యానంలో వున్నానని తరువాత తెలుసుకుని ప్రకటించాడు. బుద్ధిమీద అఖండ విశ్వాసం కల నరేంద్రుడు గొప్ప తార్కికుడు.
‘మీరు భగవంతుడ్ని ప్రత్యక్షంగా చూసారా?’ అని ప్రశ్నించేవాడు. ఆ సుదీర్ఘ అనే్వషణ చివరకు శ్రీ రామకృష్ణుల వద్దకు తీసుకు వచ్చింది. భగవంతుడ్ని ప్రత్యక్షంగా చూడాలని ఎప్పుడూ తహతహలాడేవాడు. అట్లాంటి వేదన చెందే శిష్యునికి శ్రీరామ కృష్ణ పరమహంస గురువులుగా లభ్యమయ్యారు. ఆయన్ను అదే ప్రశ్న అడిగాడు నరేంద్రుడు.
శ్రీరామకృష్ణులు భగవద్దర్శనం చేసారనే నమ్మకం కుదిరిన నరేంద్రునికి తన లౌకిక పరిస్థితులను చక్కపరచడానికి తనకోసం జగన్మాతను ప్రార్ధించవలసిందిగా కోరాడు. అప్పుడు రామకృష్ణులు ‘నేను నీకోసం ప్రార్ధన చేసినా ప్రయోజనం లేదు ఎందుకంటే నీకు పూర్తిగా జగన్మాతపై నమ్మకం లేదు’ అని జవాబిచ్చారు. దానికి నరేంద్రుడు ‘నాకు జగన్మాత గురించి జ్ఞానం లేదు, నాకోసం మీరే ప్రార్ధించండి’ అని కోరగా సరే ఈ రోజు మంగళవారం,, పవిత్రమైన రోజు ఈరోజు దేవాలయానికి వె ళ్లి కోరుకో! నీకు ఏది కావాలంటే అది ప్రసాదిస్తుందని చెప్పగా, నరేంద్రుడు ఆ రాత్రి జగన్మాతను దర్శించి కోరుకున్నది లౌకిక బాధలను నివారించే ధన ధాన్యాలు కాదు. జగజ్జనని సాక్షాత్కారంతో ‘‘అమ్మా! వివేక వైరాగ్యాలను ప్రసాదించు, దైవ జ్ఞానము కల భక్తులను చేకూర్చు, సదా నీ దర్శనాన్ని అవిచ్ఛిన్నంగా అనుగ్రహించు’’ అని కోరుకున్నాడు. ముమ్మారులు ఇదే విధంగా జరిగింది. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం కోరావని? అడిగి ‘‘నువ్వు లౌకిక సుఖాలకోసం జన్మించలేదని, జగద్ధితం కోసం జన్మించావని’’ తెలియజేసారు.శ్రీరామకృష్ణ పరమహంస గొప్ప జగద్గురువు. గురువుకు తెలియని విషయమేమిఉంటుంది. అందుకనే నరేంద్రుడు పడే ఆవేదనను తెలుసుకొన్నాడు. శిష్యునికోసం గురువే అనే్వషణ సాగిస్తాడని శిష్యుడు ఎక్కడ ఉంటే అక్కడికి గురువే వెళ్తాడని అంటారు కదా. అట్లానే రామకృష్ణ పరమహంస వివేకానందుల కోసం వేయ కళ్లతో ఎదురుచూస్తుండేవాడు.మొట్టమొదట ఆయన నరేంద్రుని ఒక గాయకునిగా కలుసుకున్నారు. తరువాత దక్షిణేశ్వర్ వెళ్లడం, అక్కడ శ్రీ రామకృష్ణుల ద్వారా దివ్యానుభూతులు పొందడం నిర్ణయాత్మకంగానే చకచక జరిగిపోయాయి. శిష్యుని అనుకొన్న మార్గంలో నడిపించడం గురువు బాధ్యత కనుక ఆ బాధ్యతను నెరవేర్చడంలో రామకృష్ణులు కృతకృత్యులయ్యారని చెప్ప నక్కర్లేదు కదా. వివేకం పొందిన నరేంద్రునికి అద్వైతం పట్ల కలిగిన పెడభావం క్రమంగా శ్రీ రామకృష్ణుల ప్రభావంతో తొలగిపోయింది.

- గున్న కృష్ణమూర్తి