అంతర్జాతీయం

నేపాల్‌తో కలసి పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండ్, ఫిబ్రవరి 2: నూతనంగా ఎన్నికైన నేపాల్ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో కలసి ముందడుగు వేస్తామని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేర్చి ఉభయులకు లబ్ది చేకూర్చే దిశగా భారత్ ప్రయత్నిస్తుందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. ఆర్థికవృద్ధి, అభివృద్ధి విషయంలో ఇరుదేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉండేలా అడుగులు వేస్తామని అన్నారు. తన రెండు రోజుల సుహృద్భావ పర్యటనలో భాగంగా నిన్న ఇక్కడకు చేరుకున్న సుష్మాస్వరాజ్ శుక్రవారం నేపాల్ అధ్యక్షుడు బిద్యాదేవి భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబాలతో భేటీ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్) కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ‘ప్రచండ’తో ఆమె చర్చలు జరిపారు. నేపాల్‌తో భారత్‌కు ఉన్న బహుముఖ, చారిత్రక సంబంధాలను మరింత పటిష్టం చేసుకుని ముందుకు వెళ్లేందుకు ఉన్న అంశాలపై చర్చలు జరిపారు. నేపాల్‌లోని అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులకు ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ఉభయతారకంగా ఉండేలా నేపాల్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వంతో సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేర్చే దిశగా భారత్ అడుగులు వేస్తుందని వారికి హామీ ఇచ్చారు.
ఈ విషయంలో నేపాల్ ప్రాధామ్యాలను పరిగణనలోకి తీసుకుని, శరవేగంగా ఆర్థికవృద్థి సాధించేలా నేపాల్‌తో కలసి పనిచేస్తామని ఆమె అన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నేపాల్‌లో రాజకీయ సుస్థిరత, అభివృద్ధి సాధించే విషయంలో భారత్ సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రచండతో ఆమె జరిపిన అల్పాహార విందు సందర్భంగా ఆమె ఈ మేరకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలోని పరిణామాలపై చర్చించామని ప్రచండ పేర్కొన్నారు. ఆయన సారథ్యంలోని సీపీఎన్-యుఎమ్‌ఎల్‌తో కలసి లెఫ్ట్ సంకీర్ణం పోటీ చేసి గణనీయమైన ఫలితాలు సాధించింది. నేపాల్‌లో రాజకీయ సుస్థిరత, ఆర్థిక ప్రగతి త్వరితగతిన సాధించేందుకు ఇరుగుపొరుగు దేశాల సహకారం అవసరమని, ఈ విషయంలో భారత్ సంపూర్ణ సహకారం అందిస్తుందని సుష్మా గట్టి హామీ ఇచ్చారని ప్రచండ తెలిపారు. నేపాల్ సంభవిస్తున్న రాజకీయ పరిణామాలను తెలుసుకునేందుకు సుష్మాస్వరాజ్ ఆసక్తి కనబరిచారని, తమ మధ్య చర్చలు సానుకూల, నిర్మాత్మకంగా సాగాయని ఆయన తెలిపారు. నేపాల్ ఎన్నికల్లో లెఫ్ట్ సంకీర్ణ పక్షాలు చక్కటి ఫలితాలు సాధించినందుకు ఆమె అభినందించారని ప్రచండ పేర్కొన్నారు. నేపాల్‌తో ఉన్న విభిన్నమైన సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా ఇరుదేశాల నాయకులు చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. నేపాల్ ప్రధాని దేవుబాతో జరిగిన లాంఛన పూర్వక భేటీలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
సుదీర్ఘకాలం నుండి నేపాల్‌తో ఉన్న ద్వైపాక్షిక, చారిత్రక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళతామని సుష్మా ఈ సందర్భంగా చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను విస్తృతం చేసే విషయంపై ఆలోచనలు, అభిప్రాయాలను భండారీ, సుష్మా చర్చించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎన్-యూఎమ్‌ఎల్ చైర్మన్ కె.పి.శర్మ ఒలీతో ఆమె నిన్న ముఖాముఖి చర్చలు జరిపారు. కాబోయే ప్రధానిగా భావిస్తున్న ఓలీతో పాటు మధేశీ పార్టీలకు చెందిన నాయకులతో నిన్న సుష్మా భేటీ అయ్యారు.
chitram...
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్‌తో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కరచాలనం