అంతర్జాతీయం

సైనిక శక్తి చాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: ‘సర్వసత్తాక సైనిక పాటవానికి ప్రపంచ ప్రశంసలు దక్కేలా వాషింగ్టన్ వేదికపై అద్భుత పరేడ్ నిర్వహించండి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ విభాగాన్ని ఆదేశించారు. అయితే చైనా, ఫ్రాన్స్, ఇండియాలాంటి అనేక దేశాలు తమ సైనిక సత్తాను ప్రదర్శించుకుంటున్నట్టే, ఇదీ సాధారణ పరేడ్ మాత్రమేనని వైట్‌హౌస్ అంటోంది. నిజానికి ప్రపంచంలోనే అత్యంత గొప్ప మిలటరీ శక్తి కలిగిన అమెరికాకు వార్షిక సైనిక పరేడ్‌లు నిర్వహించే ఆనవాయితీ లేదు. ‘అమెరికా రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టే మిలటరీ అంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం. అందులో భాగంగానే సైనికులకు అమెరికన్ల ప్రశంసలు అందేలా అద్భుతమైన పరేడ్ నిర్వహించాలని రక్షణ విభాగాన్ని కోరారు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. అతిపెద్ద సైనిక పరేడ్ నిర్వహించాలన్న ట్రంప్ ఆసక్తిపట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నట్టు వాష్టింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ముఖ్యంగా జాతీయవాదులు, మాజీ మిలటరీ అధికారులు వ్యతిరేక మనోభావాలు వ్యక్తం చేస్తున్నారని కథనంలో పేర్కొంది. సైనిక సత్తాను ప్రదర్శించే సంస్కృతి శతాబ్దాల క్రితంనాటిదని, ప్రపంచ యుద్ధాల తరువాత క్రమంగా అది కనుమరుగవుతూ వచ్చిందని తన కథనంలో పేర్కొంది. గల్ఫ్ యుద్ధం ముగిసిన తరువాత 1991 జూన్‌లో వాషింగ్టన్ డీసీ వేదికగా రాజ్యాంగ నిర్ణయం మేరకు సైనిక ప్రదర్శన నిర్వహించారని తన కథనంలో గుర్తు చేసింది. ఇదిలావుంటే, అకస్మాత్తుగా సైనిక సత్తా ప్రదర్శన నిర్వహించాలన్న ట్రంప్ నిర్ణయంలో నిజాయితీ కనిపించడం లేదని పలువురు అంటున్నారు. తన సార్వభౌమాధికారానికి తగిన గౌరవం అందుకోవడానికే తప్ప, సైనికులకు ప్రశంసల కోసం కాదని రిటైర్డ్ మేజర్ జనరల్ పాల్ ఎటోన్ అభిప్రాయపడ్డారు. వార్షిక సంప్రదాయంగా దీన్ని కొనసాగించే యోచన కూడా ఉండి ఉండొచ్చన్నారు. గత ఏడాది ఫ్రాన్స్‌లో నిర్వహించిన బాస్టిల్ డే వేడుకలకు హాజరైన ట్రంప్, రెండు గంటలపాటు అక్కడి పరేడ్ చూసి ఆశ్చర్యపోయారు. ‘అద్భుతం’ అంటూ కితాబిచ్చారు. ఆ క్షణంలోనే అమెరికాలోనూ నిర్వహించాలన్న తలంపును ప్రకటిస్తూ ‘మేమూ ప్రయత్నిస్తాం’ అన్నారు.
అందులో భాగంగానే గత జనవరి 18న మిలటరీ కమాండర్స్, డిఫెన్స్ సెక్రటరీతో నిర్వహించిన సమావేశంలో ‘ఫ్రాన్స్ తరహా సైనిక సత్తా ప్రదర్శన అమెరికాలోనూ నిర్వహించాలని కమాండర్‌గా ఆదేశిస్తున్నా’ అంటూ మార్చింగ్ ఆర్డర్ ఇచ్చారని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ‘కమాండర్ ఆదేశాల మేరకు అత్యద్భుత సైనిక సత్తా ప్రదర్శన నిర్వహణకు సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఒక రూపం సంతరించుకున్న తరువాత మిగిలిన వివరాలు వెల్లడిస్తాం’ అని రక్షణ విభాగం అధికార ప్రతినిధి ధామస్ క్రోసన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.