అంతర్జాతీయం

టెక్నాలజీ అభివృద్ధికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 11: సాంకేతిక విజ్ఞానాన్ని సమగ్రాభివృద్ధి సాధనంగా ఉపయోగించాలే తప్ప విధ్వంసం కోసం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడిక్కడ పిలుపునిచ్చారు. సైబర్ స్పేస్ దుర్వినియోగాన్ని అన్ని కోణాల్లోనూ పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సైబర్ స్పేస్‌ను ఇటు ఉగ్రవాదులు, అటు హ్యాకర్లు తమ సంకుచిత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ప్లీనరీలో మోదీ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత చేకూరింది. పాలనా విధానాల్లో టెక్నాలజీని అనుసంధానం చేయడం వల్ల అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందని, సంపద పరివ్యాప్తికి ఇది దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత దేశ అభివృద్ధిలో టెక్నాలజీ అన్ని కోణాల్లోనూ ఉపయోగపడుతోందని పేర్కొన్న మోదీ, కృత్రిమ మేధో సంపత్తి (ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్) విషయంలోనూ నాయకత్వ స్థాయిని సంతరించుకునేందుకు భారత్ నిర్విరామ కృషి చేస్తోందని ఈ ప్లీనరీలో మోదీ స్పష్టం చేశారు. దీంతోపాటు నానో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలోనూ భారత దేశం నిరుపమానమైన ప్రగతి సాధిస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి సాధించినా పేదరికం, పౌష్టికాహార రాహిత్యాల నిర్మూలన పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదన్నారు. ఈ రెండు వౌలిక సమస్యలపై దృష్టి పెట్టకుండా క్షిపణులు, బాంబుల తయారీకే విలువైన వనరుల్లో ప్రధాన భాగాన్ని ప్రపంచ ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయని మోదీ అన్నారు. టెక్నాలజీని అభివృద్ధి కోసం ఉపయోగిస్తేనే దానివల్ల ప్రపంచ దేశాలన్నీ పురోభివృద్ధి సాధిస్తాయని, పేదరికం, పౌష్టికాహారలోపం వ్యాధుల వంటి సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యకర అవని ఆవిర్భావం సాధ్యమవుతుందన్నారు. ఈ ప్లీనరీలో యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ సహా అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. సైబర్ ప్రపంచాన్ని జిహాదీలు తమ సంకుచిత లక్ష్యాల సాధనకు వినియోగించుకుంటున్నారని, దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీతో దుబాయ్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రశంసించిన మోదీ ‘ఓ ఏడారినే మార్చేశారు. ఇదో అద్భుతం’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో గల్ఫ్ ఎమిరేట్ మొత్తం ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగిపోతోందని పేర్కొన్న ఆయన, 9.5శాతం మంది ప్రజలు పేదరిక రేఖ దిగువనే మనుగడ సాగిస్తున్నారని తెలిపారు. దీన్ని నిర్మూలించాలంటే పేదరికం, నిరుద్యోగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, విద్యావ్యాప్తకి పెద్దపీట వేయాలని, అందరికీ ఆవాస కల్పనే ధ్యేయంగా పని చేయాలన్నారు. ఇవన్నీ కూడా పూర్తిస్థాయి అభివృద్ధి లక్ష్య నిర్దేశనంతోనే సాధ్యమవుతాయన్నారు. భారత్‌లో తమ ప్రభుత్వం ఈ లక్ష్య సాధన కోసం టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటోందని, అభివృద్ధి సంపద అందరికీ అన్న ధ్యేయంతో పని చేస్తోందని తెలిపారు. మొత్తం 125 కోట్లమంది భారతీయుల సాధికారతే ధ్యేయంగా అన్ని కీలక రంగాలపైనా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.
భారత దేశ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో ఆరోవంతు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పాతికేళ్లుగా మాత్రృత్వ మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్న మోదీ, భారతదేశం ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ సాధించిన విజయాలను వివరించారు. కేవలం ఒక కిలోమీటర్‌కు ఏడు రూపాయల ఖర్చుతోనే అంగారక గ్రహం పైకి వ్యోమనౌకను పంపగలిగామని, అలాగే భారత్‌లో రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గిందని మోదీ గుర్తు చేశారు. కనిష్టస్థాయి ప్రభుత్వం, గరిష్టస్థాయి పాలన అన్న లక్ష్యంద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలను దేశ ప్రజలు అందరి ముంగిళ్లకు చేరుస్తున్నామన్నారు.
chitram...
దుబాయ్‌లో ఆదివారం ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ప్లీనరీలో పాల్గొన్న ప్రధాని మోదీ