ప్రకాశం

శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ప్రజలతో మమేకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 15:శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు హితబోధ చేశారు. గురువారం అమరావతి నుండి పార్టీశ్రేణులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాపార్టీ అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని, జరుగుతున్న పరిణామాలు, విషయాలపై అవగాహన పెంచుకుని బాధ్యతలు గుర్తించి పనిచేయాలని అన్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని చెప్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ సమస్యలను తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు మంచివికావని, ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి సమస్యలే అజెండాగా ముందుకు వెళ్లాలని తెలిపారు. జిల్లాల వారీగా పార్టీ పురోభివృద్దికి పనిచేస్తూనే నిత్యం ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్రఅన్యాయం జరిగిందని, విశాఖలో రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు లేవని, విభజన చట్టంలోని అంశాలు అమలుకు నోచుకోవటం లేదని తెలిపారు. తాను స్వయంగా 29సార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్రం కనికరం చూపించలేదని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బిజెపితో లాలూచీ పడుతున్నట్లు స్పష్టమైందని, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి కేసుల నుండి బయటపడేందుకే కేంద్రంతో పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరని, ఎన్నికలు సంవత్సరంలో వస్తున్నందున రాజీనామాలు చేసినా ఎన్నికల సంఘం తిరిగి ఎన్నికలు పెట్టే పరిస్ధితి లేదని గుర్తించే వారు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్రంలో తిరిగి అధికారం మనదేనని చెబుతు పదవులు ముఖ్యంకాదని, ప్రజలకు సేవచేయటం ముఖ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రాజెక్టులకు పెట్టుబడులు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని అన్నారు. గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు పార్టీ సమావేశాలు సక్రమంగా నిర్వహించి పార్టీబలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, లిడ్ క్యాప్ చైర్మన్ ఏరిక్షన్‌బాబు, రాష్టప్రార్టీకార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, జిల్లాపార్టీ కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
శింగరకొండ తిరునాళ్లు
ఘనంగా నిర్వహించాలి
అద్దంకి, ఫిబ్రవరి 15: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి 63వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్టీఓ కమ్మ శ్రీనివాసరావు కోరారు. తిరునాళ్ల ఏర్పాట్లపై గురువారం శింగరకొండలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని అన్నారు. ప్రధానంగా విద్యుత్, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు తిరునాళ్ల మహోత్సవ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈనెల 27వ తేదీన తిరునాళ్ల మహోత్సవం ప్రారంభం అవుతుందని, 27నుండి మార్చి ఒకటవ తేదీవరకు బ్రహోత్సవాలు జరుగుతాయని, చివరిరోజు మార్చి ఒకటిన జరిగే తిరునాళ్లను చూసేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి నుండి శింగరకొండ వరకు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు అధికారులు, పారిశుధ్యం కోసం మున్సిపల్ అధికారులు, విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు ట్రాన్స్‌కో, మంచినీటి సౌకర్యంతో వివిధ శాఖలకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, తిరునాళ్ల మహోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్ధార్ బ్రహ్మయ్య, దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ హైమారావు, ఎంపీడీఓ హేమాద్రినాయుడు, ఎస్సై సుబ్బరాజు, శింగరకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్డి, మాలకొండ దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఇ.చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరుపై ఎంపికి నివేదిక
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 15 : ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డిని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ విజయ నిర్మల కలిసి కేంద్ర పధకాల పనితీరు పై నివేదికను గురువారం అందించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి కృషిచించాయి యోజనా క్రింద కేంద్రం నుండి విడుదలైన ఐదు కోట్ల 30 లక్షల రూపాయలకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు చేశారని అడిగారు., ముఖ్యంగా సంసాద్ ఆదర్శ గ్రామ యోజన క్రింద ఉన్న దద్దవాడ, గణపవరం, పిసిపల్లి ఆదర్శ గ్రామాల్లో అవసరం మేరకు ట్యాంకు రీహ్యాబిలిటేషన్, బోర్‌వెల్ రీచార్జ్ చేయాలని , అన్నీ ఆవాస ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే మార్చి లోపు నిధులను సద్వినియోగం చేయాలని కోరగా వీలైనంత త్వరగా నిధులు ఖర్చు పెట్టి రైతులకు అండగా నిలుస్తామని ఎంపి వైవి సుబ్బారెడ్డికి ఆమె వివరించారు.