సబ్ ఫీచర్

అనర్ఘ రత్నాలు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పెద్దలందరూ ఎందువల్లనో అన్ని విషయాలలోనూ స్ర్తిలకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. అన్ని సందర్భాలలోనూ పురుషులకన్నా ముందుగా స్ర్తిలనే ప్రస్తావిస్తూ వచ్చారు. అమ్మా నాన్న, భార్య, భర్తలు, సీతారాములు, రాధాకృష్ణులు ఇత్యాదిగా.
కాని వాస్తవ జీవితంలో మాత్రం పురుషుడు ముందు ఉంటాడు. ఆడది అతని వెనకాలే ఉంటుంది. ఇదేం విచిత్రమో అర్థంకాదు.
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉండి ఉంటుంది? అనేది అందరి అనుభవ పూర్వకమైన సామెత.
‘అదృశ్యంగా వుండి ఆడది అద్భుతాలు సృష్టిస్తుంది’ అనేది సృష్టిలో ఎవ్వరికీ త్వరగా అంతుచిక్కని మహోన్నత సత్యం.
ఇంతకూ ‘సామెత’ అనే పదం ఎలా ఏర్పడిందో తెలుసా? అది ‘స్మృతి’కి స్వల్ప వికృత రూపం. స్మృతి అంటే అందరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకొని స్మరించుకొనదగిన ‘సుస్థిర శాస్తవ్రాక్యం’ అని అర్థం.
అలాగే ‘స్ర్తి’ అనే పదం ఎలా ఏర్పడిందో ఎవరైనా చెప్పగలరా? చాలా కష్టం. స్ర్తి అనే పదం ‘స్థిరీ’ అనే పదానికి సంక్షిప్త రూపం. స్ర్తి అనే పదానికి నిర్వచనం- స్థిరయతి స్వికీయ పురుషన్య వీర్యం స్వీయ గర్భే- ఇతి స్థిరీ- స్ర్తి అని. ఆ విధంగా భూమిపైన సృష్టికి అంతకూ మూలాధారం స్ర్తియే అవుతున్నది.
మరో విచిత్రం - స్ర్తిలు అందాల గనులై, పురుషుల మనోమోహనులై, అంతకుమించి అనర్ఘ రత్నాలై ఎల్లప్పుడూ కళకళలాడుతూ వుండడం.
‘అనర్ఘ’ అంటే ‘వెలకట్టలేని’ అని అర్థం. స్ర్తిలు ఎన్నటికీ విలువ కట్టలేని రత్నాలు. అంటే వెలుగులు లేక మెరిసే పదార్థాలు స్ర్తిలే. ఇది అక్షర సత్యం. స్ర్తిలే కంటికి ఇంటికీ సర్వ ప్రపంచానికీ వెలుగులు అనేది విశ్వవ్యాప్తంగా సర్వజనులూ కాస్త ఆలస్యంగానైనా ముక్తకంఠంతో చాటుతున్న సత్యం.
‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనేది అందరినోటా వినవచ్చే మాట. అయితే ఇంతటి మహోన్నత స్థానాన్నీ, గౌరవాన్ని స్ర్తిలకు లభింపజేయాల్సిన ఆవశ్యకత సర్వ ప్రపంచానికీ ఎందువల్ల కల్గింది? అంటే వాస్తవ పరిస్థితి ఏమిటో గమనిద్దాం.
84 లక్షల రకాలుగా వుండే స్థావరాల్లో, జంగమాల్లో అంటే ఒక స్థానాన్ని వదిలి మరో స్థానానికి కదిలి వెళ్ళలేని వృక్షాలలోనూ- అలాగే భూమి మీదా, ఆకాశంలోనూ విశ్వవ్యాప్తంగా సంచరించగల అనంతమైన జీవరాసులలోనూ స్ర్తి పురుష వ్యత్యాసం ప్రస్ఫుటంగా కానవస్తూ స్ర్తిలు మాత్రమే పురుష సంయోగం ద్వారా గర్భం ధరించడానికి అర్హులై మానవ జాతులలో 9 నెలలపాటూ, మిగతా జంతువులలో వేర్వేరు కాలాలపాటూ పిల్లలను తమ గర్భాలలోనే పెంచి ఆ తరువాత మాత్రమే భూమిపైకి తేవడం జరుగుతున్నది. ఇలా పిల్లల్ని తమ గర్భంలో ధరించి అక్కడనే కొంత కాలం పెంచి తర్వాత వారిని బయటకు తెచ్చి - మళ్లీ కొంతకాలం తన ఒడిలో పడుకోబెట్టుకొనీ, కూర్చుండబెట్టుకొనీ, పాలను ఇచ్చి కొద్దిగా పెరిగిన తరువాత బాహ్యంగా లభ్యం అయ్యే ఆహారాన్ని ఇచ్చి పెంచే సంపూర్ణ సృష్టికర్తలు స్ర్తిలే.
అందువల్లనే మాట్లాడ నేర్వనున్న ప్రతి శిశువుకూ మొట్టమొదటగా నేర్పే మాట ‘అమ్మ’ కాగా మొదట బోధించే పాఠం ‘మాతృదేవోభవ’ అని.
అందరూ తెలుసుకోవాల్సిన మహత్తర రహస్యం అమ్మ అనే పదానికి మూల రూపం ‘అంబ’ అని. ‘అంబ’ అంటే ‘కన్ను’ అని అర్థం. ‘నాన్న’ అనే పదానికి మూలరూపం ‘నయన’ అంటే కూడా కన్ను అనే అర్థం. అంటే అమ్మా నాన్న మనకు రెండు కళ్ళుగా ఉండి ఎల్లప్పుడూ మనకు సరైన దారిని చూపిస్తూ ఉండేవారు అన్నమాట. కానీ అమ్మతో మాత్రమే ప్రతి జీవికి అవినాభావ సంబంధం ఉంటుంది.
జనన కాలంనుంచే కాక అంతకుముందు గర్భధారణ సమయంనుండి కూడా ఎప్పుడు ఏమి చేయాలో ఎందుకోసం చెయ్యాలో సవివరంగా తెలియజెప్పి అనుక్షణం సరైన దారిని చూపేది అమ్మయే కాబట్టి. ఇంతటి మహత్తర బాధ్యత కలిగి అమ్మగా ఉండే అర్హత కేవలం స్ర్తిలకే ఉండటం వారి పూర్వజన్మ సుకృతం మాత్రమేనని చెప్పక తప్పదు. పురుషులకు అంతటి అదృష్టం లేదు. స్ర్తి జీవితమే ఒక మహాతపస్సు . మహాతపస్వులే భూమిపై సృష్టి నిర్వహణకై స్ర్తిలుగా జన్మిస్తారు అనేది మహదాశ్చర్యకరమైన సృష్టి రహస్యం.
ఎన్ని విధాలుగా చూసినా పురుషుడు బాల్య, యవ్వన, కౌమార వార్థక్య దశలు అన్నింటిలోనూ స్ర్తికన్నా ఏ విధంగానూ ఎక్కువ కాకపోవడమే కాక అన్ని విధాలా తక్కువే అని ప్రకటిస్తూ లక్షలాది సంవత్సరాలుగా జనులందరూ తరచు గుర్తుచేసుకుంటున్న సత్యం.
స్ర్తిణాం ద్విగుణం ఆహారం బుద్ధిశ్చ ఆపి చతుర్గుణం
సాహసం షడ్గుణం చ ఇవ, కామో అష్టగుణం ఉచ్యతే- అని.
ఈ శ్లోకానికి అర్థం విడమరచి చెప్పనవసరం లేదు. స్ర్తిలు సర్వవిధాలా పురుషులకన్నా ఎంత గొప్పవారో ఇది స్పష్టం చేస్తున్నది.
అందువల్లనే స్ర్తిలు ‘అనర్ఘ రత్నాలు’ అనే సత్యాన్ని పురుషులు అందరూ గ్రహించి, తమకు జన్మనిచ్చి, సరైన దారి చూపే తల్లులుగా వారిని ఆరాధించడంలోనే అనంతమైన ఆనందం సమాజానికి అంతటికీ లభిస్తుందని అర్థం చేసుకోవడం అవసరం అవుతుంది.

-సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి