అంతర్జాతీయం

సంతాన జాప్యానికి అస్తమాయే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 16: అస్తమా సమస్యతో బాధపడే మహిళలు గర్భిణులు కావడానికి ఎక్కువ కాలమే పడుతుందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. ఈ సమస్య కలిగిన మహిళలు సంతానలేమికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చని శ్వాసకోశ సంబంధిత వైద్య పత్రికలో ప్రచురితమైన ఓ వ్యాసంలో నిపుణులు స్పష్టం చేశారు. అయితే అస్తమా వ్యాధిని నివారించేందుకు దీర్ఘకాలంగా చికిత్స చేయించుకున్న మహిళలు ఇతరుల కంటే త్వరితగతిన సంతాన సాఫల్యం పొందే అవకాశం ఉంటుందని వ్యాసకర్తలు తెలిపారు. అస్తమా లక్షణాలను నివారించేందుకు ఉపయోగించే కార్డిటో స్టెరాయిడ్స్ వల్ల గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న వాదనను అధ్యయనకర్తలు కొట్టిపారేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి పది శాతం మహిళల్లో అస్తమా సమస్యతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఇది పునరుత్పాదక వయసులోనే ఎక్కువగా వస్తుందని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వర్శిటీకి చెందిన వైద్యుడు లుక్ గ్రెస్కోవియాక్ వెల్లడించారు.
ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 5.6వేల మంది అస్తమా వ్యాధిగ్రస్తుల స్థితిగతులను పరిశోధకులు పరీక్షించారు. వీరిలో పదిశాతం మంది తమకు అస్తమా ఉందని వెల్లడించారని, మొత్తంమీద ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో మిగతావారి కంటే కూడా గర్బం దాల్చడం అన్నది చాలా ఆలస్యమే అయ్యిందన్న విషయాన్ని తెలిపారని ఆయన పేర్కొన్నారు.