సబ్ ఫీచర్

ఇదిగోండి పరిష్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో చాలామంది గలగలామాట్లాడేస్తుంటారు. అదే నలుగురిలోకి వెళ్లి మాట్లాడమంటే తడబడుతుంటారు. నేటికాలంలోమహిళామండలులు ప్రతి కాలనీకి ఒక్కటి ఉన్నాయి. ఆ మహిళామండలిలోనో లేక ఏ టీవీ చానల్ వాళ్లో వచ్చి నాలుగు మాటలు చెప్పండి అని అడిగితే చాలు గొంతు తడారిపోతుంటుంది. మాటలు పెగలవు. ఎందుకిలా జరుగుతోంది.
మరేంలేదు. కేవలం అలవాటు లేక ఇదంతా జరుగుతుంది. మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ముందుగా మీ అపార్ట్‌మెంట్‌లోనో, లేక మీ స్నేహితులతో మాట్లాడండి. దానికన్నా ముందు విషయం మీద పట్టు సాధించండి. అవగాహన పెంచుకోండి. దేనిగురించి మాట్లాడుతున్నామో దాన్ని గురించి పూర్తి అవగాహన ఉంటేచాలు. మొదలు భయపడినా గొంతుతడారినా వణుకు వచ్చి చిరు చెమటలు పోసినా సరే మీరు కొద్దిసేపట్లోనే మామూలు స్థితికి వచ్చేస్తారు.
ఇక ఆ తరువాత మీకున్న విషయ పరిజ్ఞానంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటారు. మొట్టమొదట అందరినీ ఒకసారి పలకరింపుగా మాట్లాడండి. మెల్లగానైనా చిరునవ్వు వచ్చేట్టుగా మాట్లాడడం ఆరంభించండి. శ్రోతల్లో ఆసక్తి పెరుగుతుంది. తప్పకుండా మీరు చెప్పేది వింటారు. అన్నీ తెలిసిన విషయాలే అయినా వాటికి రంగు రుచివాసన వచ్చేవిధంగా సామెతలు,జాతీయాలు, పలుకుబళ్లు ఉపయోగించండి. విషయాన్ని ఇంతకు ముందుకాలంలో ఎవరైనా ఎదుర్కొన్నారేమో చూసి చెప్పండి. భవిష్యత్తులో మీరు ఆ పనిని నిర్వర్తిస్తే వచ్చే లాభాలు మీదృష్టిలో ఎలా ఉంటాయో వాటిని పరిశోధనాత్మకంగా చెప్పండి. ఇక ఏమి శ్రోతలే కాదు వేదకనలంకరించిన ఉన్న పెద్దలూ మీకు చప్పట్లు కొడుతారు. ఇక అపుడు మీరే ఏ భయం సంకోచం లేకుండా చక్కని భాషా పటిమతో మాట్లాడుతారు. తెలుగునాట మాట్లాడేటపుడు తెలుగులోనే మాట్లాడండి. ఎక్కడికి వెళ్లినా అక్కడ తెలుగు వారు ఉంటే వారితో తెలుగులోనే మాట్లాడండి. తెలుగు తెలీని వాళ్లు ఉన్నప్పుడే మరో భాషలో మీరు ఉపన్యాసం ఇవ్వండి. అపుడు మీకు మీ భాషపై ఉన్న మక్కువ తెలుస్తుంది. అదేకాదు మీరు రోజూమాట్లాడే భాషే కనుక అనర్గళంగా మాట్లాడేస్తారు.విషయాన్ని మరింత విపులంగా చెప్పడానికి మీ భాష మీకు తోడుగా ఉంటుంది. ఇక ఉపన్యాస కేసరి అనే బిరుదునివ్వడానికి శ్రోతలు వెనుకాడరు.

-ఎస్. లక్ష్మి