Others
అప్పుడప్పుడు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం అప్పుడప్పుడు
కన్నీటి గాయాల మీంచి నడిచెళుతుంది
పగిలిన అద్దాల్లాంటి రోజుల్ని ఏరుకుంటూ
విడిపోయ వగర్చే క్షణాల్ని దోసిలిలో పట్టుకుంటూ
ఆవిరైపోయన ఆశల పొగని బుడ్డీలో దాచుకుంటూ
కాలం అప్పుడప్పుడు కన్నీటి గాయాల
మీదనుంచి నడిచెళుతుంది..
ముసుగు కప్పుకుని
తాగివాగే మైకాన్ని చీత్కరించుకుంటూ
ఎదుటివారి మీదకు చూపులను చెక్కి
ఏమెరగనట్టు నంగి నంగి నడిచే
కంత్రీగాళ్ల కాళ్లను తోసుకుంటూ
పులిసి కుళ్లుకంపు కొట్టే
కంపల్లాంటి మాటల వాసన మీంచీ
అప్పుడప్పుడూ బాధతో నడిచెళుతుంది..
పచ్చని మైదానాన్ని చుట్టుకున్న
ఆమె నవ్వును కాస్త బుగ్గలకి అద్దుకుంటూ
పండుకు ముక్కుతో తాళం వేసిన
చిలుక తెలివిని పలకరిస్తూ
పసి నవ్వుల వానలో తడుస్తూ
విరబూసిన మల్లెల మకరందాన్ని
ఒళ్లంతా పులుముకుంటూ
అప్పుడప్పుడు
సరదాల పరదాల మీంచీ నడిచెళుతుంది
కాలం భాషకు నువు బందీవి
కాలం చేసే గాయానికి నువ్వే మందువి..