జాతీయ వార్తలు

అతిపెద్ద జెండా ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, జనవరి 23: దేశంలోనే అతి పెద్దదైన, పొడవైన మువ్వనె్నల పతాకాన్ని శనివారం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాంచిలోని మహారీ మందిర్‌లో ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా అతి పెద్దదైన, పొడవైన జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పారికర్ తెలిపారు. ఈ జెండా ఎత్తు 66 అడుగులు, వెడల్పు 99 అడుగులు ఉండగా, దీనిని 293 అడుగుల పొడవైన కర్రకు అమర్చారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు హాజరయ్యారు.