హైదరాబాద్

అన్నా...రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశించిన తిరుగుబాటుదారుల మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని డివిజన్లలో మిత్రపక్షాల అభ్యర్థులు బరిలో ఉండటం, మరికొన్ని డివిజన్లలో కొత్త ముఖాలను పోటీకి నిలిబెట్టడంతో అభ్యర్థికి, పార్టీ శ్రేణుల మధ్య సత్సంబంధాల్లేకపోవటంతో టిఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీల ప్రచారం చప్పగానే సాగుతోంది. ప్రస్తుత అభ్యర్థులు, తిరుగుబాటు నేతలంతా కలిసి టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేసినా, వారిలో ఒక్కరికి మాత్రమే బి ఫారం దక్కటంతో ఇతర తిరుగుబాటు నేతలచే నామినేషన్ల ఉపసంహరణ అధినాయకులకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే! నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఆ తలనొప్పి అభ్యర్థులకు ఏర్పడింది. ఒకే డివిజన్ నుంచి అధికార టిఆర్‌ఎస్, విపక్షాలు కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీల టికెట్లు ఆశించిన వారిలో, అవి దక్కిన వారు ప్రస్తుతం అభ్యర్థులుగా ప్రచారం చేస్తుండగా, టికెట్లు దక్కని నేతలు, నామినేషన్లు ఉపసంహరించుకున్న తిరుగుబాటు నేతల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లపోగా, మరికొందరు పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. కానీ తిరుగుబాటు నేతల్లో ఎక్కువ మంది అజ్ఞాతంలోనే ఉండటంతో ఆ పార్టీలకు చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా టికెట్లు ఆశించిన వారిలో ఒక్కో డివిజన్ వారీగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక శాతం అభ్యర్థులు తమ సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకుని పోటీలో దిగారు. కానీ అదే సామాజికవర్గానికి చెందిన తిరుగుబాటుదారులు ఇపుడు ప్రచారంలో తమకు కలిసిరాకపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్దిరోజుల ముందు టికెట్‌ను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా పరస్పర ఆరోపణలు, దూషణలు చేసుకున్న నేతలు ఇపుడు టికెట్లు దక్కని వారి మద్దతు కోసం బ్రతిమాలుతున్న సందర్భాలున్నాయి. ఇక టిడిపి, బిజెపి మిత్రపక్షాలు పోటీ చేస్తున్న డివిజన్లలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సీట్ల (1వపేజీ తరువాయ) సర్దుబాటు వ్యవహారంలో తలెత్తిన నిరసనలు ఇంకా చల్లారనేలేదు. టిడిపి పోటీ చేస్తున్న 84, బిజెపి పోటీ చేస్తున్న 66 డివిజన్లలో మిత్రపక్షం నేతల సహాకారం ఏ మాత్రం లభించటం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. మరికొన్ని డివిజన్లలో అభ్యర్థులు మిత్రపక్షాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలకు, అభ్యర్థులకు మధ్య, అలాగే అభ్యర్థులకు అసంతృప్తి వర్గాలకు మధ్య నేటికి ఉన్న దూరం బడా నేతల ప్రచారంతోనైనా తగ్గి, ప్రచారం ఊపందుకుంటుదేమోనన్న అంచనాలున్నాయి. మజ్లిస్, కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి వంటి నాలుగు, అయిదు పార్టీలు బరిలో ఉన్న డివిజన్లలో సైతం ప్రచారం అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. కోర్ సిటీలోని ముషీరాబాద్, సికిందరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, సనత్‌నగర్, సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ తరపున డిప్యూటీ సిఎం, మంత్రులు, కాంగ్రెస్ పక్షాన మాజీ మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇక శివార్లలో ప్రచారం మాత్రం పోటాపోటీగా కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పాదయాత్రలు నిర్వహిస్తూ అభ్యర్థులు నేరుగా ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.