రాష్ట్రీయం

అవినీతి రహిత పాలనకు అన్నీ ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/గూడూరు, జనవరి 21: రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించిన ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో పటిష్టంగా అములు చేస్తున్నందుకు అధికారులను ఆయన అభినందించారు. ఇటీవల జిల్లాలో సంభవించిన వరదల్లో సహాయ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీసు అభినందించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇ క్రాప్, మీ సేవ పౌర సరఫరాలు, ఆర్‌ఎస్‌ఆర్ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రక్రియలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు గత నెల నుంచి అమరావతిలో మకాం ఉంటూ నిరంతరంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కాగా భూ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం అందచేసిన ఆధునిక యంత్రాలను తీసుకుని వెళ్లేందుకు అద్దెపై వాహన సదుపాయాలను కల్పిస్తామన్నారు. రాష్ట్ర చీఫ్ కమిషనర్ ల్యాండ్ అక్విజిషన్ ఏసి పునీత మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందచేయడంలో కొన్ని మండలాలలో లక్ష్యాలు సాధించడంలో వెనుకబడి ఉన్నారన్నారు. మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించి వారి నుంచి వచ్చిన సమస్యలను అంశాల వారిగా వెబ్‌సైట్‌లో పొందుపరచి సకాలంలో పరిష్కరించేలా చూడాలన్నారు. ఆధార్ సిడీంగ్ ప్రక్రియ పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పాస్ సిస్టం సమర్థవంతంగా నర్వహించేలా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జెసి శర్మ తదితరులు పాల్గొన్నారు.