రాష్ట్రీయం

ఆడ కవలలకు జన్మనిచ్చి... ఆసుపత్రిలోనే వదిలేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 24: ఆడపిల్లలుగా పుట్టడమే వారి పాలిట శాపమైంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరాల్సిన శిశువులు, అందరూ ఉండి కూడా అనాథలుగా మారారు. ఇద్దరు ఆడపిల్లలు కవల సంతానంగా జన్మించడంతో, సదరు చిన్నారులను వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. నిజామాబాద్ నగరంలోని హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళకు జన్మించినట్టు ఆసుపత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసుల సహకారంతో జిల్లా ఆసుపత్రి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం- హమాల్‌వాడికి చెందిన సునీతకు మొదటి, రెండవ కాన్పులలో ఆడపిల్లలు జన్మించారు. మూడవసారి ఆమె గర్భం ధరించి నెలలు నిండడంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. సునీతకు ఈ నెల 21వ తేదీన రాత్రి సమయంలో సాధారణ కాన్పు చేయగా, ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) జన్మించారు. చిన్నారులు బరువు తక్కువగా ఉండి, ఒకింత అనారోగ్యంతో కనిపిస్తుండడంతో వారిని ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సియు వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. 24గంటలు గడిచిన మీదట శిశువులు కొంత కోలుకోవడంతో వారికి పాలు తాగించేందుకు తల్లికోసం డ్యూటీ నర్సు వాకబు చేశారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో శనివారం రాత్రి వరకూ ఎదురుచూస్తూనే ఉండిపోయారు. ఆదివారం ఉదయం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్, ఇతర అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో చిన్నారులను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన సంఘటన బయటకు వచ్చింది. కాన్పు జరిగిన మరుసటి రోజు నుండే సునీత, ఆమె వెంట అటెండెంట్లుగా వచ్చిన కుటుంబీకులు సైతం కనిపించకుండాపోవడంతో సదరు చిన్నారులు ఆమెకు జన్మించిన శిశువులు అయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులను ఎస్‌ఎన్‌సియు వార్డులోనే ఉంచి చికిత్సలు అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.