అంతర్జాతీయం

అమెరికాను కమ్మేసిన మంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్ / న్యూయార్క్, జనవరి 24: హిమపాతం గుప్పిట అమెరికా గజగజలాడిపోతోంది. దాదాపు తూర్పుతీర ప్రాంతమంతా ప్రచండ గాలులతో పాటు రికార్డు స్థాయిలో కురిసిన హిమపాతంతో అతలాకుతలమైపోయింది. ఈ సంఘటనల్లో 18మంది మరణించారు. లక్షలాదిమంది అమెరికన్లు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత రెండు రోజులుగా ఈ హిమపాత పరిస్థితి అమెరికా ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసింది. స్నోజిల్లాగా పేర్కొంటున్న ఈ హిమ ఉత్పాతానికి అమెరికా ఆగ్నేయ ప్రాంతమంతా స్తంభించిపోయిందని దాదాపు మూడు అడుగుల మంచుతో కప్పబడి పోయినట్లు కథనాలు అందుతున్నాయి. దాదాపు పది రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఈ హిమపాతం వల్ల 85 మిలియన్ మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే న్యూయార్క్, వాషింగ్టన్ సహా అనేక ప్రధాన నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు వేలాదిగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేకచోట్ల జరిగిన ప్రమాదాల్లో 18మంది మరణించారు. అనేకచోట్ల కార్లు పరస్పరం ఢీకొన్నాయి. మంచులో కూరుకుపోయాయి. న్యూయార్క్ వంటి పట్టణాల్లో కారు ప్రయాణంపై నిషేధం విధించాయి.