బిజినెస్

ఆర్థిక ఫలితాలు దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను వెల్లడయ్యే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు కూడా స్టాక్ మార్కెట్ల పోకడను నిర్దేశిస్తాయని విశే్లషించారు.
కాగా, ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ వారంతో ముగియనుండటం.. కొంత ఒడిదుడుకులకు ఆస్కారముందని కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్, ఎఫ్‌పిఐ పెట్టుబడులు, రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయి.’ అని క్యాపిటల్ వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ రిసెర్చ్ డైరెక్టర్ వివేక్ గుప్తా అన్నారు. కాగా, ఈ వారం స్టాక్ మార్కెట్లలో భారీ సంస్థలైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, ఎన్‌టిపిసి, యెస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టి తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ‘స్టాక్ మార్కెట్లపై కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నెలలోనే దాదాపు మెజారిటీ సంస్థలన్నీ తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.’ అని శామ్‌కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు. మరోవైపు రెండు రోజులపాటు మంగళ, బుధవారాల్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష ఆధారంగా విదేశీ మదుపరుల పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘ఫెడ్ రిజర్వ్ ఈ వారం జరిపే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు పెంచేందుకు అవకాశం లేనప్పటికీ, సమీక్ష ప్రభావం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు, మదుపరులపై ఉంటుంది. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఒ) గడువు ముగిసిపోతుండటం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనుంది.’ అని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. కాగా, గత వారం బిఎస్‌ఇ సెనె్సక్స్ 19 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 15 పాయింట్ల చొప్పున స్వల్పంగా నష్టపోయినది తెలిసిందే.
నేడు ఎన్‌ఎస్‌ఇ బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సోమవారం విదేశీ మదుపరులకు 3,476 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనుంది. రోజువారి సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది. ఎన్‌ఎస్‌ఇలో ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిని 1,31,924 కోట్ల రూపాయల నుంచి 1,35,400 కోట్ల రూపాయలకు పెంచారు. దీంతో ఈ బాండ్ల వేలాన్ని ఎన్‌ఎస్‌ఇ నిర్వహిస్తోంది.