ఆంధ్రప్రదేశ్‌

అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్ర రాష్ట్రంలో జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలనే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తూ ఆంధ్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ అంశం సోమవారం విజయవాడలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందని జైళ్ల శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర జైళ్ల శాఖ, డిజిపి ప్రభుత్వం ముందుంచినట్లు సమాచారం. రిపబ్లిక్ డే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని వచ్చే నెలన్నర లోగా అర్హులైన ఖైదీలను విడుదల చేయాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపురం, కడప సెంట్రల్ జైళ్లతో పాటు అనేక జిల్లా జైళ్లలో జీవిత ఖైదీలు శిక్షను అనుభవిస్తున్నారు. అత్యాచారం, తీవ్రవాదం, ఉగ్రవాద కార్యపాలాపాలు, హేయమైన నేరాలకు పాల్పడిన నేరగాళ్లకు క్షమాభిక్ష వర్తింపచేయరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఖైదీల విడుదలపై పరిశీలనకు జైళ్ల శాఖ డిజి, పోలీసు డిజిపి, నిఘా చీఫ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ల నుంచి అర్హులైన ఖైదీల జాబితాను తెప్పించుకుని పరిశీలిస్తుంది.
ఈ కమిటీ పంపిన నివేదికను మంత్రివర్గం ఆమోదిస్తుంది. అనంతరం ఈ ఫైలును గవర్నర్‌కు పంపుతారు. గవర్నర్ ఆమోదముద్రపడిన వెంటనే జైళ్ల నుంచి అర్హులైన ఖైదీలకు విముక్తి కలుగుతుంది. 2005లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకటరెడ్డి అనే వ్యక్తిని జైలు నుంచి సత్ప్రవర్తన కారణంపై విడుదల చేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. అప్పట్లో ముజిబ్ అనే ఉగ్రవాద నేరాలకు పాల్పడిన ఖైదీని కూడా విడుదల చేసి అనంతరం మళ్లీ అరెస్టు చేశారు.