శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆర్టీఐపై అవగాహనతో అవినీతి భరతం పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 24: సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతిని అంతం చేద్దామని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ సి విజయ్‌బాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పురమందిరంలో ఆదివారం సమాచార హక్కు ప్రచార సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కమిషన్ కూడా తనవంతు ప్రయత్నంగా అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటానికి కృషి చేస్తుందన్నారు. వ్యక్తిగత, ప్రజాప్రయోజనాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి అనుకున్న ఉద్దేశాలను సఫలం చేసుకోవాలన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా సమాజానికి ఎనలేని మేలు ఒనగూరుతుందన్నారు. ఇందుకోసం జిల్లాలో సమాచార హక్కు ప్రచార సాధన సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్టీఐని ఇపుడు ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు సులభతరంగా ఉందని, సామాన్యులు సైతం ఈ చట్టాన్ని వినియోగించేందుకు వీలుందన్నారు. అవినీతిని వెలికితీసేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదన్నారు. ఇందుకోసం ప్రజలలో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ సభలో హిప్నో కమలాకర్ ప్రదర్శించిన స్టేజ్ హిప్నాటిజం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమంలో డిఇఓ ఆంజనేయులు, హిప్నో కమలాకర్, బయ్యా రవికుమార్, సమాచార హక్కు ప్రచార సాధన సమితి గౌరవాధ్యక్షుడు రావూరి రమేష్, అధ్యక్ష, కార్యదర్శులు బి మారుతిరెడ్డి, సిహెచ్ యుగంధర్, కోశాధికారి గుర్రం ప్రసాద్, కె గోపీనాథ్, జెవి మురళీమోహన్, ఆర్కాట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పరిహారం పరిహాసమేనా?
ఆత్మకూరు, జనవరి 24: భారీ వరదలకు నష్టపోయిన బాధితులకు పరిహారం పరిహాసంగా మారుతోంది. రెండునెలల క్రితం వరదల వేళ ఇళ్లలోకి నీరు చేరితే రూ.4000, పాక్షికంగా దెబ్బతింటే రూ.9000 పరిహారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పాక్షికంగా కాదుకదా ఏకంగా పూర్తి కూలిన ఇళ్లకు కూడా పరిహారం దక్కని వైనమిది. ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో, మండలంలో ఒక్క ఇల్లు కూడా కూలలేదంటూ అధికారులు నివేదికల్ని పంపించారు. ఆత్మకూరు లక్ష్మణరావుపల్లెలో ఓ పేద ముస్లిం కుటుంబానికి చెందిన ఇల్లు నిలువునా కూలిపోయింది. అలాగే చాలామంది ఇళ్లలోకి నీరు రావడంతోపాటు పాక్షికంగా దెబ్బతిన్న దాఖలాలున్నాయి. అయితే తొలుత ఇలాంటి నష్టాలేమి లేవంటూ ఆత్మకూరు నుంచి కలెక్టరేట్‌కు నివేదికలు వెళ్లాయి. దీనిని తప్పుబడుతూ స్థానిక తెలుగుతమ్ముళ్లు తహశీల్దార్‌కు వివరాలు చూపడంతో విఆర్‌ఓలు ఆయా నివాసాలకు వెళ్లి నివేదికలు తయారు చేసి పంపించారు. అయితే అలా ఆలస్యంగా వెళ్లిన నివేదికలకు మోక్షం కలిగే అవకాశాల్లేవు. ఆత్మకూరులో మాత్రం ఒక్క ఇంటికి కూడా పరిహారం అందకపోవడం శోచనీయం. చాలా చోట్ల అసలుకంటే ఎక్కువగా నమోదు చేసి తెలుగుతమ్ముళ్లు హస్తలాఘవం చూపారనే విమర్శలున్నాయి. అయితే ఆత్మకూరులో మాత్రం తెలుగు తమ్ముళ్ల లెక్క తాలుకు తకరారు అటుంచితే వాస్తవ బాధితులకు కూడా రిక్తహస్తమే మిగలడం ఆవేదనకు గురిచేసే పరిణామం. ఇదిలాఉంటే దెబ్బతిన్న రోడ్లకు పరిహారం నిధులు సంగతి కూడా ఇంతవరకు ఊసేలేదు. కాగా, భారీ వర్షాలతో చేతికొచ్చే దశలో ఉన్న మినుము పంట కాస్తా మొలకెత్తి రైతన్నలు లబోదిబోమన్నారు. ఎడతెరపి లేకుండా వారంపాటు కురిసిన భారీ వానల వల్ల మినుము పంటలో కాయలన్నీ బాగా తడిసి ముద్దయ్యాయి. అప్పటి వరకు ఎండి ఉన్న కాయకు ఒక్కసారిగా అవసరానికి మించి నీటి తడి సోకడంతో మొలకెత్తిపోయింది. ఎంతో ఆశలు పెట్టుకున్న పంట కాస్తా చేతికందకనే కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. మెట్ట రైతాంగం మినుము సేద్యంపై ప్రత్యేక ఆసక్తి కనబరచగా, వారికి రిక్తహస్తమే మిగిలినట్లైంది. అరాకొర మిగిలి ఉన్న రైతులకు కూడా సరిగ్గా రెండురోజుల క్రితం కురిసిన జల్లులు మరింత కన్నీటి పర్యంతమయ్యేలా చేశాయి. బహిరంగ మార్కెట్‌లో మినపప్పు ధర ఆశాజనకంగా పెరిగి ఉండటంతో మినుము పంటపై రైతులంతా ప్రత్యేక వ్రద్ధ చూపారు. చివరికి అసలు కూడా దక్కక పంట చేతికి రాకపోవడంతో దిగాలు పడిపోయారు. పంట చేలో వర్షపునీరంతా నిలిచిపోయింది. అలాగే పెసర పంటలో ఎండిన దశలో ఉన్న కాయలు కాస్తా నీటి చుక్క అతిగా తగలగానే మొక్క నుంచి కోయకనే పప్పు బద్ద రెండుగా పగిలిపోయాయి. అందులో నుంచి మొలక రావడంతో రైతన్న పెట్టుబడి, శ్రమ అంతా వృధాగా మారింది. ఆత్మకూరు, వింజమూరు మండలాల్లో ఎక్కువగా రైతులు నష్టపోయారు. ఈ రెండు మండలాలకు సరిహద్దుగా ఉన్న పడకండ్ల పంచాయతీ పరిధిలోని గండ్లవీడు, బొటికర్లపాడు, తదితర గ్రామాల్లో రైతులంతా భారీగానే నష్టపోయారు. గత ఏడాది పొగాకు సాగులో నష్టాలు చవి చూసిన రైతన్న ఈ సంవత్సరం మినుము పంటతోనైనా ఆర్థికస్థితి సరిదిద్దుకుందామని ఆశించి నిలువునా కుంగిపోయారు. అనంతసాగరం మండలంలోని వివిధ గ్రామాల్లో మిరప సాగు చేస్తున్న రైతుల కంట్లో కారం కొట్టేలా భారీ వర్షం నిరాశ మిగిల్చింది. వ్యవసాయాధికారులు సర్వేలు నిర్వహించి పంట నష్టంపై గణాంకాలు సేకరించడంలో నిబద్ధత కరవు. ఈక్రమంలో పరిహారం అసలు రైతుకు ఎంత మాత్రం దక్కుతుందనేది సందేహాస్పదమే. రాజకీయ పలుకుబడి ఆధారంగా నివేదికలు, సిఫారసులతో పరిహారం లభించిన గత అనుభవాలు అందరికీ విధితమే.
ఇసుక రీచ్‌ల కోసం
తెలుగు తమ్ముళ్ల
పోటాపోటీ
రంగంలోకి దిగుతున్న బడా గుత్తేదారులు
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, జనవరి 24: ఇసుక రీచ్‌లు మహిళ సంఘాల నుంచి చేజారిపోతున్నాయి. టెండర్ల ద్వారా ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను ఈ టెండర్ల ద్వారా వేలం నిర్వహించి ఎక్కువ కోట్ చేసిన వారికి కేటాయించునున్నారు. గతంలో డ్వాక్రా సంఘాలు ఇసుక రీచ్‌లు నడుపగా కొన్నిచోట్ల వారి మాటున తెలుగుతమ్ముళ్ల హవా కన్పించింది. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తిపలికి టెండర్ల ద్వారానే ఇసుకరీచ్‌లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 25 రీచ్‌లకు వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల 9వ తేదీలోపు రీచ్‌లకు ఆన్‌లైన్‌లో టెండర్లను దాఖలు చేసుకోవాలని గడువు ఇచ్చారు. ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. జిల్లాలో కేవలం 9 రీచ్‌లకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నట్లు సమాచారం. పడమటిపాళెం, సజ్జాపురం, గొల్లకందుకూరు, అప్పారావుపాళెం, పుచ్చలపల్లి, ఎన్‌వి కండ్రిగ, చిగురపాడు, వేగూరు, కొల్లగొట్ల రీచ్‌లకు మాత్రమే ఇసుకను తవ్వుకొనేందుకు వీలు పడుతుందని పర్యావరణ అధికారులు నివేదిక సమర్పించారు. అయితే జిల్లా అధికారులు మాత్రం 25 రీచ్‌లకు ఈ టెండర్ ద్వారా వేలానికి సిద్ధమయ్యారు. ఇసుక విధానంలో క్యూబిక్ మీటర్ ఇసుక గరిష్టంగా 500 రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ట్రాక్టర్ ఇసుక 3 యూనిట్లు ఉంటే 1500 రూపాయలు అవుతుంది. గత విధానంలో 2500 వరకు విక్రయించారు. జిల్లాలో ఏడాదికి 25 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం కాగా గత ఏడాది కనీసం 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిపోయినట్లు అంచనా. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు మండలాలలో ఇసుక రేవులకు అనుమతులు లేవు. తవ్వకాలు మాత్రం రాత్రింబవళ్ళు తేడా లేకుండా నిర్విరామంగా జరిగాయి. రీచ్‌లకు ఈ టెండర్ల ద్వారా నిర్వహించి ఎక్కువ కోట్ చేసిన వారికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వేలందార్లు వేల సంఖ్యలో రీచ్‌ల కోసం పోటీ పడుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడే ప్రమాదం కన్పిస్తోంది. ధర కంటే తక్కువ కోట్ చేయకుండా కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ వ్యత్యాసంతో కోట్ చేసే విధంగా సిండికేట్‌గా మారే ప్రమాదం ఉంది. ఇసుక కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొత్తవారిని రాకుండా లీడ్ చేసి ఉన్నవారితో సిండికేట్‌గా ఏర్పడి రీచ్‌లను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఇసుకకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగుతమ్ముళ్ళు ఎక్కువగా ఇసుక టెండర్లను కైవశం చేసుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో డ్వాక్రా గ్రూపు మహిళలకు కేటాయించిన ఇసుక రీచ్‌ల్లో కూడా అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులే చక్రం తిప్పారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో కూడా తెలుగు తమ్ముళ్ళు చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

పరిశ్రమలతో ఆర్థికాభివృద్ధి
ఎస్‌పి గజరావ్ భూపాల్ వెల్లడి
ముత్తుకూరు, జనవరి 24: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల స్థాపన ఎంతో కీలకమని, తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ఎస్‌పి డాక్టర్ గజరావ్ భూపాల్ అన్నారు. ఈనెల 26న జరగనున్న రిపబ్లిక్ డే సందర్భంగా కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా థర్మల్ పవర్ టెక్, ఎన్‌సిసి థర్మల్ కేంద్రాల ఆధ్వర్యంలో బ్రహ్మదేవం, ఎపి జెన్‌కో రోడ్డు మార్గమధ్యం వద్ద సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి ఆదివారం ఎస్‌పి ముఖ్యఅతిథిగా హాజరై పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మూడు విభాగాల్లో జరిగిన ఈ ర్యాలీలో చిన్నపిల్లలు, ఉద్యోగులు పాల్గొన్నారు. తొలుత ఎస్‌పి ర్యాలీలో సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాలుష్యంపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి మనిషికి వ్యాయాయం తప్పనిసరి అని, దీంతో కొన్ని రకాల వ్యాధులు నయమయ్యే అవకాశం ఉందని ఎస్‌పి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎస్‌పి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో థర్మల్ కేంద్రాల ఉన్నతాధికారులు రవిశంకర్‌ప్రసాద్, ఎపి జెన్‌కో థర్మల్ కేంద్రం భద్రతా విభాగాల డిఎస్‌పి రెడ్డినాయక్, బ్రహ్మదేవి గ్రామ సర్పంచ్ ఎ సుబ్రహ్మణ్యం, ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి రమేష్‌కుమార్, సాగునీటి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న కిరోసిన్ పట్టివేత
సంగం, జనవరి 24: సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో ఆదివారం వేకువజామున 4 నాలుగు గంటలకు రేషన్‌షాపు నుండి అక్రమంగా తరలిస్తున్న 80 లీటర్ల కిరోసిన్‌ను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కిరోసిన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి రెవెన్యూ శాఖకు అప్పగించారు.

పెన్నా నది అనుసంధానానికి యోచన
నాయుడుపేట, జనవరి 24: జిల్లా అభివృద్ధి కోసం పెన్నా నదిని గోదావరి, కృష్ణా జలాలతో అనుసంధానించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన నాయుడుపేటలోని టిడిపి నాయకుడు కె గోపాలరెడ్డి తనయుడు డాక్టర్ క్రాంతిరెడ్డి డెంటల్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం నివాసంలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, తాగునీటికి కరవు లేకుండా నదులను అనుసంధానించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందన్నారు. పార్టీ ప్రారంభ దశ నుండే నదుల అనుసంధానికి ఎన్‌టిరామారావు నాంది పలికారన్నారు. నాటి నుండి నేటి వరకు చంద్రబాబునాయుడు అదే పంధాలో ఉన్నారన్నారు. గంగ కాలువల నిర్మాణాల కోసం పెండింగ్‌లో ఉన్న 313 కిలోమీటర్ల అటవీ భూములకు ఇటీవల అనుమతులు తీసుకువచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. పట్టిసీమ ఎత్తి పోతల పథకం ద్వారా నదులను అనుసంధానించారన్నారు. జిల్లాలోని పెన్నా నదిని కూడా గోదావరి, కృష్ణా జలాలకు అనుసంధానించే యోచనలో ప్రభుత్వం పావులు కదుపుతున్నదన్నారు. అదే జరిగితే జిల్లా అభివృద్ధి సునాయాసంగా జరుగుతుందన్నారు. పార్టీలో నాయకులు 3 లక్ష్యాలతో పనిచేస్తున్నారన్నారు. బాబు పాలన సుస్థిరంగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని, రాష్ట్రాన్ని తద్వారా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పరసా, టిడిపి నాయకులు ఎస్ విజయభాస్కర్ రెడ్డి, చైర్ పర్సన్ శోభారాణి, వేనాటి రామచంద్రారెడ్డి, ఎంపిపి కనె్నమ్మ, జి రఘునాధ రెడ్డి, చిట్టమూరు జెడ్పీటిసి భారతమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పి రామిరెడ్డి, పట్టణాధ్యక్షులు కె కృష్ణారెడ్డి, తడ జెడ్పీటిసి బి శ్రీ్ధర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.,

బేస్‌బాల్ పోటీల్లో విజేతలు వీరే
బాలురల్లో కడప, బాలికల్లో గుంటూరు
వింజమూరు, జనవరి 24: వింజమూరు రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సాయి ఫిజికల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో రెండురోజులపాటు అండర్-19లో రాష్టస్థ్రాయిలో నిర్వహించిన బేస్‌బాల్ ఫైనల్స్‌లో బాలుర విభాగంలో వైఎస్‌ఆర్ కడప, బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. రన్నర్స్‌గా నెల్లూరు, కర్నూలుజిల్లాల జట్లు నిలిచాయి. విజేతలైన జట్లకు ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు జ్ఞాపికలు అందజేసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలిసారిగా రాష్టస్థ్రాయిలో వింజమూరులో ఈ పోటీలను నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి రాములు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో సహా ఆటలకు ప్రాధాన్యత ఇచ్చి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలన్నారు. బేస్‌బాల్ రాష్ట్ర మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాయామ విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి దంతులూరు వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ ఎన్నం రామచంద్రారెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు గొంగటి రఘునాధరెడ్డి, వెలుగోటి వీరరాఘవులు, రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిఖార్జునరెడ్డి, ఎస్సై వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ లీలాకృష్ణ, 13జిల్లాల నుంచి జట్ల కోచ్‌లు, మేనేజర్లు, ఐదువందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.