Others

ఆయనకోసమే సినిమా చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనకోసమే
సినిమా చేశా
ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి డిక్టేటర్‌తో యాక్షన్ చిత్రాలకు ఎదిగిన డైరెక్టర్ శ్రీవాస్. బాలకృష్ణను 99వ మైలురాయి దాటించే అదృష్టాన్ని దక్కించుకుని, ఈ సంక్రాంతికి హిట్టు పట్టుకున్న డైరెక్టర్ శ్రీవాస్‌తో
చిట్‌చాట్..

బాలయ్య కోసమే కథ రాశారా?
ఔను. లౌక్యం హిట్ తర్వాత బాలయ్యను కలిసినప్పుడు మనమో సినిమా చేద్దామన్నారు. అది -99వ సినిమా అన్నారు. దాంతో ఆయనకోసమే డిక్టేటర్ కథ సిద్ధం చేశా.
ఎలా అనిపించింది?
ఆయనలా అనగానే నేనూ షాకయ్యా. బాలయ్యతో సినిమా కత్తిమీద సాము అనుకుంటారు. ట్రావెల్ చేశాక తెలిసింది ఆ ధోరణి సాము కాదు, సిన్సియారిటీ అని. రెండు నాల్కల ధోరణి నచ్చని మనిషి. సినిమాలో డిక్టేటరే కానీ, షూటింగ్‌లో డెడికేటర్.
సినిమా రెస్పాన్స్?
వెరీ హ్యాపీ. సంక్రాంతికి పడిన సరైన సినిమా. ముఖ్యంగా బాలయ్య అభిమానుల దాహార్తి తీరిపోయింది. మంచి ఉత్సాహాన్నిచ్చింది.
పోటీలో కలక్షన్స్?
ఒక పండగ. నాలుగు సినిమాలు. కచ్చితంగా కలక్షన్లు షేర్ చేసుకోవాలి. అయినా డిక్టేటర్ బెస్ట్ వసూళ్లే రాబట్టింది.
దర్శక నిర్మాతగా రిస్క్?
నిజానికి ఈ సినిమాకు దర్శకత్వమే చేయాలనుకున్నా. కానీ కొన్ని పరిస్థితులతో రెండూ చేయాల్సి వచ్చింది. భవిష్యత్‌లో ఈరోస్ బ్యానర్‌పై మరిన్ని సినిమాలు చేస్తా.
బాలకృష్ణ ఇచ్చిన గిఫ్ట్?
బాలయ్య ఫ్యామిలీలో ఓ మెంబర్ స్థానం దొరికింది. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది?
హిందీలో రీమేక్?
ఔను. అజయ్‌దేవగన్ హీరోగా ఈరోస్‌తో కలిసి హిందీలో చేస్తున్నా.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ఏ సబ్జెక్టూ రెడీ చేసుకోలేదు.

-శ్రీ