బిజినెస్

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కన్సల్టెంట్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ఆదిలాబాద్ పట్టణంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ముందడుగు సాధించాయి. చర్చలు ఫలిస్తే త్వరలోనే సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. 1998లో మూతపడిన ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు తెలంగాణ బిసి సంక్షేమం, ఆటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, సిసిఐ అధికారులు సోమవారం సచివాలయంలో మంత్రి చాంబర్‌లో సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన అన్ని అంశాలను సమగ్రంగా విశే్లషించి నివేదిక అందజేయాలని కన్సల్టెంట్‌కు బాధ్యత అప్పగించారు. ఆస్తులు, అప్పులు, యంత్రాల పనితీరు, బ్యాంకు వివరాలు, ఇతర అంశాలను అధ్యయనం చేసి డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను కన్సల్టెంట్ సిద్ధం చేస్తుంది. కాగా, ఫిబ్రవరి రెండవ వారంలో మంత్రి రామన్న ఆధ్వర్యంలో సిసిఐ అధికారులు మరోసారి సమావేశం అవుతారు.