సబ్ ఫీచర్

అడ్డు అదుపు లేని అవహేళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా పాటిస్తారు. ఇతర మతాచారాలను అవహేళన చేయకూడదు. ఈ విషయం అందరికి తెలుసు. భారతీయులు ఆసేతు హిమాచలం వివిధ దేవతలను పూజిస్తారు. చెట్లని పూజిస్తారు. జంతువులను పూజిస్తారు. ఎవరు ఏ రూపాన్ని భక్తితో పూజించినా ఆ పూజలన్నీ తనకే చేరుతాయని గీతలో శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణించాడు. మన సంప్రదాయాలని మనం గౌరవించుకోవాలి. ప్రింటు మాధ్యమాలు, దృశ్యమాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయిన తరువాత భారతీయులే భారతీయ ఆచారాలను అపహాస్యం చేయడం ప్రారంభించారు. ప్రభుత్వానికి కోర్టులకు కూడా మన సనాతన ధర్మం మీద అధికారం ఉన్నట్లు భావిస్తున్నారు. దేవాలయ నిర్వహణ ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం ఏమిటి? ఇటీవల అయ్యప్పస్వామి దర్శనానికి స్ర్తిలు ఎందుకు వెళ్లరాదు? అని కోర్టు ప్రశ్నించిందిట. మసీదులోనికి స్ర్తిలను ఎందుకు రానీయరు? అని ఇస్లాం మత పెద్దలను ప్రశ్నించగలదా? దైవ సంబంధమైన విషయాలు శాస్త్రాలననుసరించి శిష్టాచారాలననుసరించి ఉంటాయి. ప్రభుత్వానికి కోర్టులకి వాటిపై అధికారం లేదు.
మన పత్రికలు దేవతలపై కార్టూన్‌లు ప్రచురిస్తాయి. అందుకు ఏమీ సంకోచించవు. ఈ అవహేళన ఇప్పుడు అడ్డు అదుపులేకుండా సాగిపోతున్నది. వీటిని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. చాలా సినిమాలలో వివాహ దృశ్యాలుంటాయి. వాటిని అసలు వివాహాలకంటే మిక్కిలి ఆడంబరంతో జరుపుతున్నారు. మంత్రాలతో యధావిధిగా మంగళ సూత్రాలు కట్టిస్తున్నారు. అక్షింతలు వేయిస్తున్నారు. ప్రమాణాలు చేయిస్తున్నారు. ఈ దొంగ పెళ్లిళ్లకు పవిత్రమైన వేదమంత్రాలు చదివే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? ఇక టీ.వి.లలో ఇవి మితిమీరిపోయాయి. దొంగ నిశ్చితార్థాలు, దొంగ దత్తతలు మంత్రయుక్తంగా చూపిస్తున్నారు. అంత్యేష్ఠి అనగా చనిపోయిన తరువాత చేయవలసిన కర్మలు యధావిధిగా చేయిస్తున్నారు. బ్రతికి ఉన్నవారిని చంపివేసి వారికి శ్మశానంలో అపర కార్యలు నిర్వర్తిస్తున్నారు. పిండ ప్రదానాలు చేయిస్తున్నారు. స్ర్తిలచే శవాలను మోయిస్తున్నారు. వారిచే తల కొరివి పెట్టిస్తున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని నిజ జీవితంలో కూడా కొందరు స్ర్తిలు ఈ పనులు చేయిస్తున్నారు. వారికి మంచి ప్రచారం లభిస్తున్నది. స్ర్తిలు ఇలాంటి పనులు ఎందుకు చేయరాదు? అని ప్రశ్నిస్తే ఇక్కడ జవాబు వ్రాయడం సాధ్యంకాదు. పెద్దలనడిగి తెలుసుకోవాలి.
ఈ అవహేళన ఏ స్థాయికి చేరిందో చూడండి. ఒక సినిమాలో ఒక వితంతువు దేవాలయంలోకి వస్తుంది. ఆమె ప్రియుడు అక్కడకు వచ్చి అమ్మవారి మెడలోని మంగళసూత్రం తీసి తన ప్రియురాలికి కడతాడు. అమ్మవారిని అతి నిష్టతో కొలిచే భక్తులు ఎవరూ నోరు ఎందుకు ఎత్తరు? నేడు వర్తక విధానం అంతా మారిపోయింది. ఒకే వస్తువుకి వివిధ పేర్లుపెట్టి వాటిని ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్లపై ఆయా దేవతల చిత్రాలు ముద్రిస్తున్నారు. వినియోగదారులు ప్యాకెట్లు చింపి పెంటపై పారేస్తున్నారు. ఈ చిత్రానికి ఈ విధంగా అపచారం జరగకూడదనే ఆలోచన ఎవరికీ రాకపోవడం ఆశ్చర్యం. బ్రాందీ షాపులకు దేవతల పేర్లు పెడుతున్నారు. అటు ప్రభుత్వానికికాని సెన్సారు వారికి గాని ఈ విషయాలు ఏమీపట్టవు. సెన్సారు అనేది ఇప్పుడు నామమాత్రం. అది గట్టిగా పనిచేస్తే తెరపై ముద్దులు ఎందుకు కనిపిస్తాయి? పావుమీటరు గుడ్డ ధరించి హీరోయిన్లు ఎందుకు గంతులేస్తారు? సినిమాలలో యముడు, చిత్రగుప్తుడు, వినాయకుడు వంటి పురాణ పురుషులకు వెకిలి వేషాలువేసి చూపిస్తున్నారు. మన దేవతలని ఎలా చూపినా మనం నోరెత్తకుండా చూస్తామనే ధైర్యం సినిమాలు తీసేవారికి ఉంది. కనుక ధార్మిక సంస్థలు పెద్దలు ఈ విషయంలో గట్టిగా ఉద్యమించి సనాతన ధర్మానికి అపచారం కల్గకుండా కృషిచేయాలి.

- వేదుల సత్యనారాయణ