తెలంగాణ

అధిక ధరకు విద్యుత్ కొనవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: చత్తీస్‌గఢ్ నుంచి అదనపు విద్యుత్‌ను ఎక్కువ మొత్తానికి కొనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్నందున అదనపు విద్యుత్‌ను అధిక ధరలకు కొనవద్దని చాడ కోరారు. చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.900 కోట్ల భారం పడుతుందని తెలిపారు.