హైదరాబాద్

ఆహా..ఏమి రుచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ బొంతు రామ్మోహన్ రూ. 5కు సరఫరా చేస్తున్న సబ్సిడీ ఆహారాన్ని ఆరగించారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించినానంతరం పక్కనే ఉన్న సబ్సిడీ ఆహార కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలో ఆకలితో అలమటించే వారికి మధ్యాహ్నం రూ.5కే భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే! శుక్రవారం ఎవరూ ఊహించని విధంగా మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కేంద్రంలో ప్రత్యక్షమైన తానూ క్యూలో నిలుచోని అయిదు రూపాయలు చెల్లించి భోజనాన్ని ఆరగించారు. అనంతరం లబ్ధిదారులకు ఆయన భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ఈ భోజనం నాణ్యత, మోతాదుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భోజన పథకం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను ఏ విధంమైన చర్యలు చేపట్టాలన్న అంశంపై లబ్ధిదారుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ భోజన పథకాన్ని మరిన్ని కేంద్రాలకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి భోజనాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రస్తుతం నగరంలోని 50 కేంద్రాలున్నాయని, త్వరలోనే వీటి సంఖ్యను వందకు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ రామ్మోహన్ వెల్లడించారు.