అందరికీ నచ్చే కృష్ణాష్టమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మర్యాద రామన్న చిత్రంలో నటించినప్పుడు ఎంత ఆనందించానో అంతగా ‘కృష్ణాష్టమి’లో నటిస్తున్నప్పుడు ఆనందించానని, నా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో వచ్చిన పాత్ర మరోసారి రాదేమోనన్నట్లు డిజైన్ చేశారని, కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమని’ నటుడు సునీల్ తెలిపారు.
వాసువర్మ దర్శకత్వంలో సునీల్, నిక్కీగల్రాని, డింపుల్ చోప్‌డే ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’ ఈనెల 19న విడుదలకు సిద్ధమైంది. చిత్రంలోని పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ దర్శకుడు వాసువర్మ చిత్రాన్ని ఇంటిలిజెంట్‌గా ప్రెజెంట్ చేశాడని, తన కెరీర్‌లోనే ఓ మంచి చిత్రంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ చిత్ర కథను సునీల్‌కు ఏడాదిన్నర క్రితమే చెప్పానని, ఇందులో ఏదో వెలితిగా ఉందని చెప్పడంతో ఆరు నెలలపాటు స్క్రిప్ట్‌ను పూర్తిచేసి, షూటింగ్‌కు వెళ్లామని, రెండుగంటల యాభై నిమిషాల సినిమాను రెండు గంటల పదిహేను నిమిషాలకు కుదించామని, ఈనెల 19న విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత రాజు తెలిపారు. ఓ మంచి సినిమాకు ఏమేం కావాలో అవన్నీ సమపాళ్లలో కుదిరిన చిత్రం ఇదని, సునీల్ సినిమాకోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి పనిచేశారని, తప్పక అందరికీ నచ్చుతుందని దర్శకుడు వాసువర్మ తెలిపారు. కార్యక్రమంలో నిక్కీగల్రాని, గౌతంరాజు, దినేష్, చోటా కె.నాయుడు, అనంత్‌శ్రీరామ్, పృథ్వి, చిత్ర యూనిట్ పాల్గొనగా నిర్మాత రాజు ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికలు అందించారు.