ఉత్తరాయణం

ఆదివాసీల ఆరోగ్యం మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరికం, నిరక్షరాస్యత మరియు జన సమూహం నుండి దూరంగా ఉండటంవల్ల ప్రాథమిక వైద్య సదుపాయాలు వినియోగిచకపోవడం వల్ల ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు ఎదుర్కొంటున్న ముఖ్య ఆరోగ్య సమస్యలుగా సికిల్‌సెల్ ఎనిమియా, మలేరియా, డెంగ్యూ, అతిసార వ్యాధి, క్షయ, హెపటైటిస్, ధాలిసీమియా మరియు ఇతర జన్యుసంబంధిత వ్యాధులు ఉన్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహిమటాలజీ పేర్కొన్న విధంగా ఆంధ్ర, తెలంగాణ ఆదివాసీలు సుమారు 11-34% మధ్య సికిల్‌సెల్ ఎనిమియాతో బాధపడుతూ భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ప్రాంతాల వారీగా వెళితే, ఉన్న 23జిల్లాల్లో రెండు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఈ వ్యాధి బారిన ఎక్కువగా ఆదివాసీలు పడుతున్నట్లు సమాచారం. మన ప్రభుత్వాలు ఆదివాసీల ఆరోగ్యంపై ఇంకా దృష్టిపెట్టాలి. వీరిని పలురకాలుగా ఆదుకోవాలి.
- డాక్టర్ పోటు భగత్‌కుమార్, విశాఖపట్టణం
హిందూ వ్యతిరేకుల పట్ల జాగ్రత్త!
ఇండియాలో ఈరోజు హిందూ వ్యతిరేక శక్తులు ఒక్కటై తమ కార్యకలాపాలు నడుపుతున్నారు. వీరి వెనుక పాకిస్తానీ తీవ్రవాద ముఠాలేమైనా చేరి వున్నాయా? (లేక) ఇండియాలోనే హిందూ వ్యతిరేక ముఠా ఏర్పాటుచేస్తున్నారా? అనే అనుమానం రాక మానదు. దేశభక్తిగల ప్రతి పౌరుడు అప్రమత్తంగా వుండాలి. ఈ దుష్టశక్తులను దేశంనుండి తరిమివేసే రోజు రావాలి. వీళ్లంతా మేధావులుగాదు. మేధావులనుకొనేవాళ్లు తమ పురస్కారాలను వెనక్కు ఇస్తామంటున్న వాళ్లంతా వీరి వెనుక వుండి నడుస్తున్నారు. పురస్కారాలు ప్రభుత్వమిచ్చినప్పుడు తిరస్కరించి వుండాల్సింది. పురస్కారాలు దేశమిచ్చిన గౌరవం. దాన్ని ఒకప్పుడు ఒప్పుకొని ఇప్పుడు తిరస్కరిస్తే దేశాన్ని తిరస్కరించినట్లేగదా! ఈరోజు చాపకింద నీరులా మత మార్పిడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. హిందూ స్ర్తిలతోను, పురుషులతోను కలిసిమెలిసి తిరిగేవారు ఈరోజు తాము పలానా మతానికే పరిమితమని దానికే చెందినవారమని కన్పడటానికి డ్రస్‌కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి వీరికి హిందూ సమాజంలో కలిసిమెలసి తిరిగే కోరిక లేదన్నది తెలుస్తున్నది. ఇవన్నీ కుహనా లౌకికులకు పురస్కారాలు వెనక్కు యివ్వాలంటున్న వాళ్లకు తెలియవా? వీటిని ఏ ఛాందస వాదమంటారు? మత ఛాందసవాదమనరా? పురస్కారాలు వెనక్కు ఇచ్చేవారు దీన్ని గ్రహించలేరా? మీరు వెర్రిగొర్రెల్లా ప్రవర్తించటం సిగ్గుచేటు. హిందూ వ్యతిరేకులను దేశంలోని ప్రతి ఒక్కరు ఒక కంటకనిపెట్టి వుండాలి. ఇటువంటి పనులు చేసేవారు దేశభక్తి లేనివారే.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
కొందరికేనా ప్రయోజనాలు?
నేటికీ మన దేశంలో 70శాతం కుటుంబాలకు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలలో సగటు నెలసరి ఆదాయం పదివేలకు పైబడి లేదు. ఆహార భద్రత చట్టం ప్రభుత్వాలు జారీచేసిన రేషన్‌కార్డులే ఇందుకు నిదర్శనం. పరిస్థితి ఇలావుంటే పాలనా యంత్రాంగానికి మాత్రం వివిధ సౌకర్యాలు, అలవెన్సులతోపాటు భారీగా జీతభత్యాలు పెంచుతూ పాలకులు తమ జీత భత్యాలు భారీగా పెంచేసుకుంటున్నారు. పెన్షను సౌకర్యంకల్గి ఉన్నారు. అయినప్పటికీ అవినీతి ఏమాత్రం ఆగలేదు సరికదా ఇంకా తీవ్రమవుతున్నది. ఈ విధంగా జీతభత్యాలు పెరుగుదల అధిక ధరలకు దారితీస్తూ సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ. దేశంలో పెరుగుతున్న సంపద కొందరే దక్కించుకుంటూ పేద కుటుంబాలను మోసగించడం సరికాదు. అన్నివర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పేద కుటుంబాల ఆదాయం పెరిగే రీతిలో పాలన సాగాలే తప్ప కొందరికి అధిక మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తే ముందు ముందు దుష్పరిణామాలు తప్పవు.
- యస్.ఉద్దవరెడ్డి, గుంతకల్లు
వదలని భాషా దాస్యం
బ్రిటిషు దాస్యం పోయినా ఇంగ్లీషు దాస్యం మిగిలి వుంది. మనం తెలుగువారం. అయినా మన తెలుగు పేర్లను ఇంగ్లీషు పొడి అక్షరాలతోనే వ్రాస్తున్నాం పిలుస్తున్నాం. ప్రభాకరకృష్ణమూర్తిని పీ.కే.మూర్తి అంటున్నాం. ‘అన్నవరపు సత్యశివప్రసాదు’ను ఏయస్‌యస్‌ప్రసాదు అంటున్నాం. కొందరి పేర్లయితే ఇంగ్లీషు పొడి అక్షరాలునే మిగిలిపోయాయ. నందమూరి తారకరామారావు యన్.టి.ఆర్ గానే ప్రసిద్ధులు. అట్లే మమీడాడీ అంకుల్ ఆంటీ సంస్కృతిని వదలలేమన్నాము. తెలుగు వారు తెలుగువారిని తెలుగులోనే పిలిచి వ్రాసుకుందాం!
- శివరామయ్య, హైదరాబాదు
క్రీడా బిల్లుకు మోక్షం ఎప్పుడు?
అన్ని జాతీయ క్రీడా సంఘాలను ఆర్.టి.ఇ. పరిధిలోనికి తీసుకువచ్చేందుకు యుపిఏ ప్రభుత్వం హయాంలో మంచి కృషి జరిగి చివరకు క్రీడా బిల్లుగా రూపొందినా ఆమోదముద్ర పడకపోవడం దురదృష్టకరం. ప్రజాదరణ కారణంగా క్రీడా సంఘాలు లక్ష