అక్షరాలోచన

దరిజేరిన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత తెలుసుకున్నా సరే
అంతు దొరకనిది ఇంకేదో ఉంటుంది
సముద్రాన్ని దోసిటితో తోడినట్లు
సాగుతున్న ప్రయత్నంలో
అందుకున్నది అణువంతే
అందుకోవలసింది బ్రహ్మాండమంత!
అణువును చూసి బ్రహ్మాండమనుకుంటే
అడుగు మొదటిలోనే ఆగిపోతుంది
ఆగకుండా సాగాలి నిరంతర శోధన
వేగవంతంగా యోగాన్ని సాధించాలి
లక్ష్యం ఎప్పుడూ సుదూరమే
కానీ గమ్యం విశాలంగా ఉంది
దారులు తెరచుకొని ఉన్నాయి
అలుపెరుగని నడకతో
అందుకోవడానికి ఉద్యమించినప్పుడు
దూరం మాయమై పోతుంది
కళ్లెదుట కల సాక్షాత్కరిస్తుంది!

-అయాచితం నటేశ్వరశర్మ 9440468557