క్రైమ్ కథ

చెడ్డవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువారం ఉదయం కోరీ నించి వచ్చిన ఫోన్ నన్ను నిద్ర లేపింది. అతను పోలీస్ శాఖలో చేరాక మేం దూరం అయ్యాం.
‘హలో మార్క్! కోరీని. నిన్ను పక్క మీంచి లేపానా?’ ప్రశ్నించాడు.
‘్ఫన్‌లో మాట్లాడటానికి మంచం మీంచి లేవక్కర్లేదు. ఎలా ఉన్నావు కోరీ?’ అడిగాను.
‘ఒకోసారి బాగా ఉండను. ఒకోసారి బావుంటాను. నువ్వు నాకో సహాయం చేస్తావా?’
‘నేను నీకో సహాయం బాకీ పడ్డానా?’
‘ఇది చేస్తే నేనే నీకు బాకీ పడతాను’
‘అది నాకు అవసరం అవుతుంది అనుకుంటున్నావా?’
‘అవచ్చేమో? అది నాకు తెలీదు మార్క్’
‘సరే. ఏం సహాయం?’ ప్రశ్నించాను.
‘్ఫన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. మీ ఇంటికి ఆహ్వానించు’
‘అలాగే కోరీ. మా ఇంటికి రా’
‘అరగంటలో అక్కడ ఉంటాను’
అతను నా నించి ఏదో పెద్ద సహాయమే ఆశిస్తున్నాడని అనుకున్నాను. అదేదో చూచాయగా అర్థమైంది కూడా. మంచం దిగి, స్నానం చేసి, డ్రస్ చేసుకోడానికి అరగంట పట్టింది. నేను బెల్ట్ బకిల్ పెట్టుకుంటూంటే డోర్ బెల్ మోగింది.
‘రా! సరిగ్గా చెప్పిన టైంకి వచ్చావు’ తలుపు తెరచి ఆహ్వానించాను.
‘ఈ ఇల్లు బావుంది. హాయిగా జీవిస్తున్నట్లున్నావు’ ఆ గదిని చూసి నవ్వుతూ అడిగాడు.
‘్థంక్స్. చెడ్డవాడు హాయిగానే జీవిస్తాడు. బ్రేక్‌ఫాస్ట్ కావాలా? సీసాలోది’
‘్థంక్స్. కాని తినడానికి ఏదైనా ఉందా?’
నేను ఫ్రిజ్‌లోంచి బర్గర్ పేటీలని తీసి వేడి చేస్తూ గ్లాస్క్‌లో విస్కీని పోసుకుని అడిగాను.
‘విషయంలోకి రా’
‘ముందుగా నిన్నో ప్రశ్న అడగనా? ఇటీవల నోరాని చూశావా?’ కోరీ ప్రశ్నించాడు.
‘లేదు. దేనికి?’
‘జాక్ హత్యకి గురైనప్పుడు ఆమెని కలిసావని అనుకున్నాను’
‘లేదు’
‘నీ బాల్య స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్ హత్య చేయబడితే నీ స్నేహితురాలికి నీ ప్రగాఢ సానుభూతిని తెలియ చేయక్కర్లేదా?’
‘అభినందనలు చెప్పాలన్నది నా అభిప్రాయం. కాని అది అమర్యాదని ఆగాను’
కోరి బయటికి గట్టిగా నవ్వి చెప్పాడు.
‘నువ్వు జాక్‌లా చాలా చెడ్డవాడివి మార్క్’
‘అది నువ్వు అడక్కుండానే చెప్పాగా’
‘నేను అడిగే సహాయం నోరా కోసం. జాక్ హత్యకి సంబంధించిన వార్తలు చదివావా?’
‘అప్పుడప్పుడు’
‘ఐతే నీకు సాక్ష్యం గురించి గుర్తుండే ఉండాలి. తన అపార్ట్‌మెంట్‌లో ఆ రాత్రి జాక్‌కి ఎవరితోనో అపాయింట్‌మెంట్ ఉంది. అలా వచ్చిన వ్యక్తి ఎవరో కాని బలమైన గాజు ఫ్లవర్ వేజ్‌తో అతని తలని పగలకొట్టి వెళ్లాడు. మేము దినపత్రికలకి విడుదల చేయని భాగం జాక్‌కి బాగా పరిచయం ఉన్న వ్యక్తే అక్కడికి వెళ్లాడన్నది. ఆ ఎవరో నోరాకి తెలుసు’
‘అది నీకు ఎలా తెలుసు?’ ప్రశ్నించాను.
‘ఎలాగో తెలుసు’
‘అది కుదరదు కోరీ. నువ్వు సహాయం కోరే వ్యక్తి నించి ఏదీ దాచకూడదు’
‘సరే. కొంతదాకా చెప్తాను. ఆ రాత్రి జాక్ అపార్ట్‌మెంట్‌కి తను వెళ్తున్నానని నోరా ఎవరితోనో చెప్పింది. ఐతే తనకి ముందు జాక్‌ని చూడటానికి ఫలానా వ్యక్తి వస్తున్నాడని తెలిసిందని, ఆ వ్యక్తిని కలవడం ఇష్టం లేక తను ఆలస్యంగా వెళ్తున్నానని తన స్నేహితురాలికి చెప్పింది. ఇది నమ్మదగ్గ సాక్ష్యం’
‘అతన్ని అరెస్ట్ చేయలేదే? నోరా ఎవరో నీకు చెప్పలేదా?’
‘లేదు. తన స్నేహితురాలికి చెప్పింది కూడా ఖండించింది’ కోరీ చెప్పాడు.
‘ఎందుకని? ఆ హంతకుడికి నోరా సహాయం చేయాలని అనుకుందా?’
‘నీకు అంతా తెలుసు మార్క్. జాక్‌కి ప్రమాదకరమైన నేరస్థులతో సావాసం ఉంది. వారిలోని ఒకరు ఆ రాత్రి జాక్‌ని చంపారు. అతని పేరు చెప్తే నోరాని కోర్ట్‌లో సాక్ష్యం చెప్పనీకుండా చంపేస్తారనే భయంతో చెప్పి ఉండదు. కోర్ట్‌కి వెళ్లక మునుపు ఆ హంతకుడు చంపచ్చు. లేదా సాక్ష్యం చెప్పాక పగతో చంపచ్చు. తనే చంపలేకపోయినా మిత్రుల ద్వారా చంపించవచ్చు. నోరాకి జాక్, అతని మిత్రులు ఎంతటి దుర్మార్గులో తెలుసు కాబట్టి భయపడింది’
‘ఆమెకి ప్రభుత్వ రక్షణని ఇచ్చి మరోసారి ప్రశ్నించవచ్చుగా?’
‘అందుకు అనుమతి తీసుకున్నాను. కాని ఆమె మాయమైంది. ఐనా ఎక్కడ ఉందో కనుక్కున్నాను’ కోరీ చెప్పాడు.
‘ఐతే నువ్వు ఆమెని కాంటాక్ట్ చేయచ్చుగా?’
‘ఆమె మన సరిహద్దు రాష్ట్రంలో ఉంది. నేరస్థులని తప్ప సాక్షులని బలవంతంగా ఆ రాష్ట్రం నించి తీసుకురాలేం’
‘సరే. నా నించి నీకు ఏం సాయం కావాలి?’
‘పత్రికా విలేకరులకి ఇది తెలిసింది. రేపు దినపత్రికల్లో ఆ వార్త వెలువడుతుంది. దాంతో ఆమెకి ఆ హంతకుడి నించి ప్రమాదం పొంచి ఉంటుంది. ఆమె ఎక్కడ దాక్కుందో హంతకుడు తేలిగ్గా కనుక్కోగలడు. అతను ప్రమాదకారి కాబట్టి ఆమె భద్రత విషయంలో నాకు భయంగా ఉంది’
‘నేనామె దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి, నీ దగ్గరికి తీసుకురావాలి. అంతేనా?’
‘అవును. నువ్వు తెలివిగల చెడ్డవాడివి మార్క్. తలుచుకుంటే నువ్వు ఆ పని చేయగలవు’
‘్థంక్స్. కాని జాక్ హంతకుడి నించి ఆమెకి ప్రమాదం ఉందని నేను నమ్మలేక పోతున్నాను’
‘ఎందుకని?’
‘హంతకుడు తనకన్నా ముందే జాక్‌ని కలవడానికి వస్తాడని తెలిసినా అసలు వచ్చాడో లేడో తెలీదు. చంపాడో లేదో కూడా రుజువు లేదు. దాంతో వౌఖిక సాక్ష్యంతో శిక్ష పడదు’
‘ఓసారి హంతకుడి పేరు తెలిస్తే సాక్ష్యాధారాలు సేకరించడం మాకు తేలిక అవుతుంది. అతనికి, హంతకుడికి గల లావాదేవీల్లోంచి వాటిని ఎలా సేకరించాలో మాకు తెలుసు’ కోరీ చెప్పాడు.
‘నోరా ఎక్కడుంది?’
‘ఇక్కడ నించి వంద మైళ్ల దూరంలో. నేను ఊహించినట్లుగానే తన తల్లి పొలంలోని ఇంట్లో. నీకా ఇల్లు తెలుసనుకుంటాను? నువ్వెళ్లి ఆమెతో మాట్లాడతావా?’
‘సరే. నీకు సహాయం చేయడానికి కాదు. నా చిన్ననాటి మిత్రురాలైన నోరాకి సహాయం చేయడానికి వెళ్తాను. ఆమె జాక్ గర్ల్‌ఫ్రెండ్ అని ముందే తెలిసి ఉంటే అలాంటి చెడ్డవారితో స్నేహం చేయద్దని వారించి ఉండేవాడిని’
కోరీ నాతో కరచాలనం చేసి వెళ్లిపోయాడు.
స్కూల్‌లో నోరా నా క్లాస్‌మేట్. కోరీ కాలేజీలో స్నేహితుడు. నోరాకి, కోరీకి పరిచయం లేదు. కోరీ పోలీస్ శాఖలో చేరాడు. పేకాటలో నాకున్న నైపుణ్యంతో జూదమే వృత్తిగా తీసుకున్నాను. పేకాటలో ఐదంకెలు గెలిచిన నెలలు కూడా ఉన్నాయి.
* * *
కోరీ చెప్పిన చిరునామా ప్రకారం నాకు చిన్నప్పటి నించి పరిచయం ఉన్న ఆ పొలానికి మూడు గంటలు కార్లో డ్రైవ్ చేసి సాయంత్రానికి చేరుకున్నాను. చాలాసేపు వేచి చూశాక నోరా ఇంట్లోంచి బయటకి వచ్చి కోళ్ల షెడ్ వైపు వెళ్తూ కనిపించింది. నేను కారు తలుపు తెరచుకుని దిగి ఆమె షెడ్ లోంచి బయటకి రావడం కోసం ఎదురు చూడసాగాను. కొద్దిసేపటికి షెడ్‌లోంచి ఓ బుట్టతో బయటికి వచ్చిన నోరా ఛాతీ .30 రైఫిల్ టెలిస్కోప్‌లోంచి క్రాస్ లైన్స్‌లో కనిపించింది. కొద్ది క్షణాల తర్వాత తూలిపడే ఆమె ఛాతీలోంచి రక్తం కారడం కూడా కనిపించింది.
పొగలు కక్కే రైఫిల్‌ని దాని బేగ్‌లో ఉంచి, డిక్కీ తలుపుని మూసి కారుని ముందుకి పోనించాను.
జాక్‌తో ఆడిన జూదంలో నేను ఐదువేల ఏడు వందల డాలర్లు పోగొట్టుకున్నాను. అతనికి అప్పు పత్రం రాసిచ్చాను. అతని మరణానికి మునుపు అందులో పది శాతం చెల్లించమని చెప్పడానికి నా దగ్గరికి వచ్చిన వ్యక్తితో చెప్పాను.
‘సరే. జాక్ నాకు ఈ బాకీ గురించి నాకు గుర్తు చేసాడని అతనికి చెప్పు. ఇంక వెళ్లు’
‘నీకు బాగా గుర్తుండేలా చేయమని నన్ను పంపాడు’
నా పొత్తి కడుపులో మోకాలితో మూడుసార్లు తన్ని చెప్పాడు.
‘ఇది వ్యక్తిగతం కాదని అర్థం చేసుకో మిస్టర్. నేను వార్తాహరుడినే’
పేదరికంలో అప్పటికే నేను నిరాశలో మునిగి తేలుతున్నాను. మర్నాడు రాత్రి అతనికి నేను డబ్బు ఇచ్చి కోరాను.
‘అప్పు పత్రం వెనక దీన్ని నమోదు చేస్తే సంతోషిస్తాను’
‘తప్పకుండా మార్క్. నీకు గుర్తు చేసిన పద్ధతికి క్షమాపణలు. లేదా నీకు గుర్తుండేది కాదు’ నవ్వాడు.
‘నోరా నీ ఫ్రెండేగా? కాసేపట్లో వస్తుంది. కావాలంటే కలవచ్చు’ చెప్పాడు.
నేను ఆగలేదు. నాకు చిన్న మొత్తమే ఐనా ఐదు వేల ఏడు వందల డాలర్ల కోసం నేను జాక్‌ని చంపానని తెలిసినా నోరా స్నేహపూర్వకంగా దాన్ని దాచింది.
కాని నేను కోరీ చెప్పినట్లు చెడ్డవాడిని.

(ఫ్లెచర్ ఫ్లోరా కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి