నమ్మండి! ఇది నిజం!!

విమానచోరులు ( నమ్మండి.. ఇదినిజం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని కొన్ని వ్యాపారాలు, వృత్తులు ప్రమాదకరమైనవి. వాటిలో ఒకటి విమానాలని రికవరీ చేసే ఉద్యోగం. ఇలాంటి సేవని ప్రపంచంలో అతి తక్కువ కంపెనీలు అందిస్తున్నాయి.
అన్ని విమాన కంపెనీలు లేదా వాటిని కొనే వ్యక్తులు ఏ బేంక్ నించో అప్పు తీసుకుని విమానాలని కొంటూంటారు. వాయిదాలు కట్టినంతవరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఏ కారణం చేతనైనా విమాన కంపెనీలు కాని, విమానాన్ని కొన్న వ్యక్తులు కానీ వాయిదాని చెల్లించని పక్షంలో బేంక్స్ వారికి హెచ్చరికలని జారీ చేస్తాయి. దానికి వారు సరిగ్గా స్పందించకపోతే ఇక విమానాలని వెనక్కి తీసుకోవడం ఒకటే గత్యంతరం అవుతుంది. వీటిని వెనక్కి తీసుకునే పని చేపట్టే రిప్రెజెంటేటివ్స్ చురుగ్గా, తెలివిగా, సమర్థవంతంగా పని చేయాలి. లేదా భౌతిక దాడిలో ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.
విమానం ఎప్పుడూ స్థిరంగా ఒకచోట ఉండదు. ఈ రిప్రెజెంటేటివ్స్ అది ఎక్కడ ఉందో రీసెర్చ్ చేసి కనుక్కుని, తిరిగి దాన్ని ఆధీనంలో తీసుకుని విమానాన్ని ఎత్తుకెళ్లి అప్పు ఇచ్చిన కంపెనీకి దాన్ని స్వాధీనం చేయాలి. విమానం రికవరీ కంపెనీని బేంక్ కాంటాక్ట్ చేయగానే ఆ కంపెనీ ఆ రిప్రెజెంటేటివ్స్‌కి ఆ విమానం వివరాలు అందిస్తుంది. ఆ విమానాన్ని కనుగొనడం వారి మొదటి బాధ్యత. ఇందుకు ఇంధనం కొనుగోళ్లు, హేంగర్ అద్దె, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రికార్డులు మొదలైన వాటి ద్వారా ముందు ఆ విమానం ఎక్కడుందో కనుగొంటారు. తర్వాత ఆ రిప్రెజెంటేటివ్ దాని దగ్గరికి రహస్యంగా చేరుకొని, దాన్ని చట్టరీత్యా దొంగిలించాలి. ఆ విమానం మాస్టర్ కీస్, ప్రొపెల్లర్ లాక్ తాళం చెవులు, అలాంటి ఇతర పరికరాలు రిప్రెజెంటేటివ్‌కి ముందే అందజేస్తారు. ఆ రిప్రెజెంటేటివ్స్ బృందం ఆ విమానాన్ని గమ్యానికి చేర్చాలి.
ఈ ప్రయత్నంలో వారు సెక్యూరిటీ గార్డులకి, విమానం కంపెనీ మనుషులకి పట్టుబడితే కొన్ని దేశాల్లో ప్రాణహాని కూడా ఉంటుంది. అందుకని స్థానిక గూండాలని వాళ్లు తమ వెంట ఉంచుకుంటారు. ఈ రౌడీలకి ‘గ్రీజ్డ్ మంకీస్’ అని ముద్దు పేరు. అప్పుబడ్డ చాలా విమాన కంపెనీలకి, విమానం మాయమయ్యాక కానీ రికవరీ కంపెనీ రిప్రెజెంటేటివ్‌లు వచ్చారని తెలీదు. యజమానులు విమానం ఇన్‌స్టాల్‌మెంట్‌ని చెల్లించకపోతే దాని నిర్వహణకి కూడా డబ్బు ఖర్చు చేయరు. అందుకని ఎంత త్వరగా విమానాన్ని ఆధీనంలోకి తీసుకోగలిగితే అంత భద్రంగా దాన్ని తీసుకెళ్లచ్చు. ఇందుకోసం ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్స్ కూడా ఆ బృందంలో ఉంటారు. దాని పరిస్థితిని వారు చాలా త్వరగా తనిఖీ చేసి, అవసరం ఉంటే చిన్న మరమ్మతులు చేస్తారు.
ఈ బృందం నాయకుడు అన్ని రకాల విమానాలని చక్కగా నడిపే పైలట్ అయుంటాడు. పొలాల్లో మందుచల్లే చిన్న విమానం, రెండు ఇంజన్ల, పది మంది కూర్చునే విమానాల నించి, 747 బోయింగ్ దాకా దేన్నయినా నడపగలిగే వ్యక్తే ఈ ఉద్యోగానికి అర్హుడు. ప్రపంచంలో ఎన్ని రకాల విమానాలు ఉంటే అతను అన్నీ నడపగలగాలి. అప్పుడే ఆ విమానాన్ని బేంక్‌కి అందించగలడు.
నియమ నిబంధనలు ప్రతీ దేశంలో, ఒక్కోసారి రాష్ట్రంలో మారుతూంటాయి. స్థానిక, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ నియమాలు వాళ్లకి కొట్టిన పిండై ఉండాలి. విమానానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలుసుకుని, లేకపోతే ఇన్సూర్ చేసి దొంగిలించాలి.
ప్రపంచం అంతటా ఈ రిప్రెజెంటేటివ్‌లు విమానాలని వేటాడుతూ జీవిస్తూంటారు. ఓరోజు స్వచ్ఛందంగా విమానాన్ని అప్పగించే యజమానిని వారు కలవచ్చు. మర్నాడు దుర్మార్గులు, నేరస్థులైన యజమాని నించి విమానాన్ని రికవర్ చేయచ్చు.
విమానాలు వేగంగా ప్రయాణిస్తాయి. బ్రెజిల్ నించి బయలుదేరిన విమానం రాత్రికల్లా టెక్సాస్‌కి చేరుకుంటుంది. విమానాన్ని తీసుకెళ్లే, తర్వాత దింపే ఏర్‌పోర్ట్ యాజమాన్యంతో ముందే ఒప్పందం చేసుకోవడం కూడా వారి బాధ్యత.
విమానాలు ఖరీదైనవి. ఒక్కోటి కొన్ని కోట్ల డాలర్ల విలువ చేస్తాయి. ఫైనాన్స్ చేసిన బేంక్‌కి విమానాన్ని తెచ్చిస్తే, దాన్ని బేంక్ అమ్మగా వచ్చిన డబ్బులో ఆరు నుంచి పది శాతం కమీషన్ వీరికి ముడుతుంది. అంటే పదివేల డాలర్ల నించి తొమ్మిది లక్షల డాలర్ల దాకా ఎంతైనా రావచ్చు. రెండు నెలల్లో ముప్పై విమానాలని ఇలా తెస్తే ఈ కంపెనీల లాభం కోట్లలో ఉంటుంది. ఇది చట్టబద్ధమైన దొంగతనమే అవుతుంది. ఈ పని చేసేవారిని ఏర్‌క్రాఫ్ట్ రిపోమేన్ అని పిలుస్తారు. సాధారణంగా వీరి ఆఫీస్‌లు ఏర్‌పోర్ట్‌లలో ఉంటాయి.
సేజ్ పోపోవిల్ ఇన్ కార్పొరేషన్ (ఎస్‌పిఐ) అనే రష్యన్ కంపెనీ నేడు ప్రపంచంలోని అతి పెద్ద రికవరీ కంపెనీ. 1979 నించి ఈ కంపెనీ పనిచేస్తోంది. విమానాలే కాక హెలికాఫ్టర్లని, అన్ని రకాల ఓడలని కూడా ఈ కంపెనీ ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించని వారి నించి ఆధీనంలోకి తీసుకుని బేంక్‌లకి అప్పగిస్తోంది.

పద్మజ